తెలుగు రాష్ట్రాల్లో విస్తరించాలన్నది బీజేపీ వ్యూహం.. దక్షిణాదిలో ఒక్క కర్ణాటకలో తప్ప మిగిలిన రాష్ట్రాల్లో అంతగా ఆదరణలేని బీజేపీ ఈసారి ఏపీ, తెలంగాణల్లో పట్టు సాధించాలని ప్రయత్నిస్తోంది. ఇందుకు అనుగుణంగానే చేరికలను ప్రోత్సహిస్తోంది.


ఏపీలో తెలుగుదేశం పార్టీని ఖాళీ చేయించి.. ఆ స్థానాన్ని ఆక్రమించాలనే ప్రయత్నాలు జోరుగానే సాగుతున్నాయి. ఇందులో భాగంగానే ఏపీలో స్టార్ పొలిటిషన్లను ఆకర్షించి బిజేపీని బలోపేతం చేయాలని మోడీ-అమిత్ షా జోడీ భావిస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే చిరంజీవిని సంప్రదించినట్టు వార్తలు వచ్చాయి.


తాజాగా.. అమెరికా పర్యటనలో ఉన్న పవన్ కల్యాణ్.. అక్కడే బీజేపీ కీలక నేత రామ్ మాధవ్ తో చర్చించడం హాట్ టాపిక్ గా మారింది. ఎలాగైనా పవన్ కల్యాణ్ ను బీజేపీలోకి తెస్తే.. ఏపీలో కీలకమైన కాపు సామాజిక వర్గమంతా తమ వెంటే ఉంటుందన్నది బీజేపీ యోచనగా కనిపిస్తోంది.


ఎలాగూ జనసేన అంతగా క్లిక్ కాలేదు కాబట్టి.. బీజేపీలోకి వెళ్తే.. ఏపీ వరకూ పవన్, చిరంజీవి లను తమ పార్టీలోకి వచ్చేలా చేస్తే.. సగం వరకూ విజయం సాధించినట్టేనన్న ఆలోచనలో కమల దళం ఉందని తెలుస్తోంది. మరి పాతికేళ్ల రాజకీయమే లక్ష్యమంటున్న పవన్ బీజేపీ బుజ్జగింపులకు లొంగుతారా అన్నది చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: