నమ్మినవారి కోసం వైఎస్ కుటుంబీకులు ఏదైనా చేస్తారన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో ఉంది. దీన్ని నిరూపించే ఉదంతం ఇప్పుడు మరొకటి చోటు చేసుకుంది. వైసీపీ కీలక నేత విజయసాయి రెడ్డి కోసం ఏకంగా ఓ ఆర్డినెన్స్ జారీ చేశారు.


విజయసాయిరెడ్డికి ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి పదవి ఇవ్వాలని నిర్ణయించారు. కొన్నిరోజుల క్రితం ఈ పదవి ఇస్తూ ఓ జీవో కూడా విడుదల చేశారు. అయితే ఆ తర్వాత తేలిందేమంటే.. ఎంపీగా ఉన్న విజయసాయిరెడ్డి లాభదాయకమైన ఈ పదవిని చేపట్టకూడదన్న విషయం వెలుగులోకి వచ్చింది.


దీంతో విజయసాయిరెడ్డికి పదవి ఇస్తూ ఇచ్చిన జీవోను అనూహ్యంగా రద్దు చేశారు. ఆ తర్వాత ఢిల్లీలో ప్రభుత్వ ప్రతినిధి పదవి లాభదాయక హోదా కిందకు రాదని పేర్కొంటూ రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్‌ జారీచేసింది. దీంతో ఇప్పుడు విజయసాయి రెడ్డికి ఢిల్లీ ప్రభుత్వ ప్రతినిధి పదవి ఇచ్చేందుకు ఎలాంటి అడ్డంకి లేకపోయింది.


ఇప్పుడు ఈ ఆర్డినెన్స్ ఇవ్వకపోయి ఉంటే.. విజయసాయిరెడ్డి రాజ్యసభ సభ్యత్వానికి ముప్పు వచ్చేదే. చట్టసభల సభ్యులు ఇతర లాభదాయక పోస్టుల్లో ఉండకూడదన్నది ఆఫీస్‌ ఆఫ్‌ ప్రాఫిట్‌ అనే నిబంధనల ఉద్దేశం. మంత్రి పదవులు, స్పీకర్‌, స్టాండింగ్‌ కమిటీ చైర్మన్లు-సభ్యులు లాంటి పదవులు శాసనసభ విధుల్లో భాగం కాబట్టి వాటిని లాభదాయకం కింద చూడొద్దని ప్రభుత్వం తాజాగా ఒక జాబితా ఖరారు చేసింది.


మరింత సమాచారం తెలుసుకోండి: