వైఎస్ జగన్ పులివెందుల పులి. తాజా ఎన్నికల్లో ఆయన ఏపీకి సీఎం కూడా అయ్యారు. జగన్ ది భిన్నమైన  మనస్తత్వం తనకు మేలు చేసిన వారిని ఆయన బాగా గుర్తుంచుకుంటారు. ఇక తనకి కీడు చేసిన వారిని ఇంకా బాగా గుర్తుంచుకుంటారు. ఆ మాటకు వస్తే ఇపుడు కడప జిల్లా రాజకీయాలు హీటెక్కిపోతున్నాయి.


జమ్మలమడుగులో జగన్ ముఖ్యమంత్రిగా తొలి అడుగు పెడుతున్నారు.  సీఎమ్ హోదాలో జగన్ మొదటి జిల్లా పర్యటన కూడా కడప కావడం విశేషం. జగన్ రేపు ఆయన తండ్రి వైఎస్సార్  జయంతి వేళ కడపను చుట్టబెడుతున్నారు. తన తొలి అధికార కార్యక్రమాన్నిప్రత్యేకించి జమ్మలమడుగులో పెట్టారు. జమ్మలమడుగు అంటే వినిపించే మొదటి పేరు ఆదినారాయణరెడ్డి. నిన్నటి వరకూ బాబు క్యాబినేట్లో ఆయన మంత్రి. కడపను ఒంటి చేత్తో గెలుచుకుని వస్తానని చెప్పి తానే ఓడిపోయిన ఘనాపాటి.


వైసీపీలో ఉంటూ జగన్ ద్వారా జమ్మలమడుగు ఎమ్మెల్యే అయినా ఆది తరువాత పంగ నామాలు పెట్టారు. పార్టీ దూకేసి మరీ మంత్రి అయ్యారు. దాంతో పాటు జగన్ని నానా మాటలు సభ లోపలా బయటా అన్నారు. దాంతో జగన్ కి ఇపుడు చాన్స్ వచ్చింది. అందుకే జమ్మలమడుగు నుంచి అమ్ములుపొదిలో ఉన్న ఆస్త్రాలను తీయాలనుకుంటున్నారు. ఆదికి అక్కడే అదిరిపోయే ట్విస్ట్ ఇవ్వాలని జగన్ డిసైడ్ అయ్యారట. చూడాలి మరి.


మరింత సమాచారం తెలుసుకోండి: