కర్ణాటకలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి.  కాంగ్రెస్ పార్టీకి చందిన కొంతమంది ఎమ్మెల్యేలు ఇప్పటికే రాజీనామా చేశారు.  మరికొందరు రాజీనామా చేసేందుకు సిద్ధం అవుతున్నారు.  ఎప్పుడు ఏం జరుగుతుందో అర్ధంగాక అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.  


పార్టీకి సంబంధించినంత వరకు ఎలాంటి ఇబ్బంది లేదని పరిస్థితి అదుపులోనే ఉందని, త్వరలోనే అంతా చక్కదిద్దుకుంటుందని సిద్దరామయ్య అంటున్నారు.  రాజీనామా చేసిన ఐదారుగురు ఎమ్మెల్యేలు టచ్ లోనే ఉన్నారని, వారంతా తిరిగి పార్టీలో చేరుతారని అంటున్నారు.  


కానీ, రాజీనామా చేసిన ఎమ్మెల్యేలలో కొందరు ఇప్పటికే బీజేపీతో టచ్ లో ఉన్నారని తెలుస్తోంది.  రేపోమాపో వీరు పార్టీ మారతారని తెలుస్తోంది.  ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో కర్ణాటక ప్రభుత్వం మైనారిటీలో పడింది.  


బీజేపీ నేత యడ్యూరప్ప మాత్రం సైలెంట్ గా చూస్తున్నారు.  ఎమ్మెల్యేలు రాజీనామా చేయడానికి, మాకు ఎలాంటి సంబంధం లేదని అంటున్నా.. వెనకనుంచి రాజీనామాల రాజకీయం నడిపించింది అంతా బీజేపీనే అని అందరికి అర్ధం అవుతూనే ఉన్నది.  ఈరోజు బెంగళూరు తిరిగి వచ్చిన తరువాత ముఖ్యమంత్రి తీసుకునే నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుంది.    


మరింత సమాచారం తెలుసుకోండి: