రూపాయి డాక్టర్ అని  డెబ్బై దశకంలో వైఎస్సార్ కి పేరు. గుల్బర్గాలో ఎంబీబీఎస్ పూర్తి చేసి వచ్చిన తరువాత వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రజా వైద్య శాలను  పులివెందులలో ప్రారంభించి వైద్యాన్ని సామాన్యులకు చేరువ చేశారు.  ఆయన చలువతో ఆ రోజుల్లో ఎంతో మంది పేదలు ప్రాణాలను కాపాడుకున్నారు. వైఎస్ దయాగుణం నాడు రూపాయి నుంచి విశ్వ‌రూపంగా మారి  తరువాత రోజుల్లో ఏపీ మొత్తానికి ఆరోగ్యశ్రీగా విస్తరించింది.


వైఎస్సార్ ఎమ్మెల్యేగా  1978లో  తొలిసారి నెగ్గిన అయిదేళ్ళ కాలంలోనే మంత్రిగా కూడా  పనిచేశారు. అలా  చిన్న వయసులోనే మంత్రి అయిపోయిన వైఎస్సార్ కి ముఖ్యమంత్రి పదవి మాత్రం ఏళ్లకు ఏళ్ళు వూరించింది. దానికి కారణం కూడా ఉంది. వైఎస్సార్ చరిత్ర పురుషుడు. ఆయన జనం గుండెల్లో శాశ్వతంగా  నిలవాలని రాసిపెట్టి ఉంది.


అందరు కాంగ్రెస్ సీఎం ల మాదిరిగా ఏడాది రెండేళ్ళో చేసి వూరుకుంటే వైఎస్సార్ కి విలువ ఏముంటుంది. అందుకే ఆయన తన కష్టంతోనే ముఖ్యమంత్రి పదవి సంపాదించారు. తాను కోరుకున్నట్లుగానే పాలన చేశారు. కాంగ్రెస్ లో ఉన్నప్పటికీ  ఓ ప్రాంతీయ పార్టీల నేత మాదిరిగా పార్టీని శాసించారు తన మనసులో పుట్టిన ప్రతి పధకాన్ని పేదలకు  అంకితం చేశారు. 


ఈ దేశానికి విద్య, వైద్యం రెండూ కావాలని భావించి వాటిని పేదలకు చేరువ చేసిన ఘనత ఆయనదే. ఫీజు రీ ఇంబర్స్మెంట్  పెట్టి ఎంతో మంది పెదలకు లైఫ్ ఇచ్చారు. ఇక రైతులకు అండగా రైతు బాంధవుడు అయ్యాడు. కేవలం అయిదేళ్ళ్ల మూడు నెలలు మాత్రమే పాలించిన వైఎస్సార్ వేయ్యేళ్ళ పాటు జనం గుండేల్లో నిలిచిపోయేలా బలమైన ముద్ర వేసుకున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: