పెంచిన రూ.250 పించను సొమ్ముతో సహా సామాజిక పించన్ల పంపిణీ కార్యక్రమం సోమవారం పండగలా చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేపట్టంది. దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి జయంతిరోజైన జూలై 8న ఈ రెండు కార్యక్రమాలు చేపట్టేందుకు ప్రభుత్వం కార్యాచరణ చేపట్టింది. 


రాష్ట్రవ్యాప్తంగా 23,90,999 మంది వయో వృద్దుల పించన్లు అందించేందుకు ఏర్పాట్లు చేపట్టంది. అదే విధంగా 19,95,538 వితంతు పించన్లు, 6,32,113 వికలాంగుల పించన్లు, 1,06,187 నేత కార్మికులకు, 27,464 కల్లుగీత కార్మికులకు, 1,719 మంది ట్రాన్స్‌జెండర్స్‌, 1,09,741 మంది ఒంటరి మహిళలలు, 44,929 మంది మత్సకారులు, 16,866 ట్రెడిషనల్‌ కోబ్లర్స్‌, 27,461 మంది డప్పు కళాకారులు, 7,787 మంది హాస్పిటల్‌ పేషెంట్స్‌కు, 32,333 కళాకారులకు పించన్లు అందించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేపట్టింది. 


సుమారు 8385796 పించన్లకు గాను రూ.1305.84 కోట్లను ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. వీటి పంపిణీ ఆయా నియోజక వర్గాల శాసన సభ్యలు, స్థానికి ప్రజాప్రతినిధుల సమక్షంలో లబ్ధిదారులకు అందించాల్సిందిగా సంబంధిత శాఖల అధికారులకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎక్కడికక్కడ దివంగత నేత జయంతి నిర్వహించి అనంతరం పించన్ల పంపిణీ పండుగ నిర్వహించేందుకు ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి: