రైతు భరోసా పథకం కింద ప్రతి రైతుకు ఏటా 12500 రూపాయలు అందజేస్తామని జగన్ చెప్పిన సంగతీ తెలిసిందే. ఇప్పుడు ఆ దిశగా కార్యాచరణ పూర్తయింది. రైతుల తీసుకునే రుణాలను బ్యాంకులు ఈ సొమ్మును జమ చేసుకునే వీలు లేకుండా వారి చేతికే అందిస్తామని చెప్పారు. 2020 మే నుంచి ఈ పథకాన్ని అమలు చేస్తామని ఎన్నికల ప్రణాళికలో పేర్కొన్నా, గత ఐదేళ్లలో రైతుల పడిన కష్టాలను దృష్టిలో ఉంచుకుని అంత కంటే ముందే అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు.


ఒకే విడతలో రైతులకు ఇంత మొత్తాన్ని అందించడం దేశ చరిత్రలోనే ఇదో రికార్డుని అన్నారు. తుఫానులు, ఇతర ప్రకృతి వైపరీత్యాల్లో నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు రూ.2 వేల కోట్లతో విపత్తు సహాయ నిధి ఏర్పాటు చేస్తున్నామని, పంటలకు గిట్టుబాటు ధర కల్పించేందుకు రూ.3 వేల కోట్లు ధరల స్థిరీకరణ నిధి పెడుతున్నామని తెలిపారు. కల్తీ విత్తనాలు, ఎరువులు, పురుగు మందులను గుర్తించేందుకు ప్రతి నియోజకవర్గంలో నాణ్యత పరీక్ష ప్రయోగశాలలు ఏర్పాటు చేస్తామన్నారు.


ప్రతి గ్రామంలో విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్టు తెలియజేశారు. రైతుల ప్రయోజనం కోసం ప్రభుత్వానికి అవసరమైన సూచనలు, సలహాలు ఇచ్చేందుకు వ్యవసాయ మిషన్‌ ఏర్పాటు చేశామని వివరించారు. ఈ ఏడాది రైతులకు బ్యాంకుల నుంచి రూ.84వేల కోట్లు రుణాలు అందజేయాలని నిర్ణయించామన్నారు. రూ.లక్ష వరకూ పంట రుణాలు తీసుకున్న రైతులు గడువులోగా ఆ సొమ్ము తిరిగి చెల్లిస్తే వాటిపై వడ్డీ ఉండదని వెల్లడించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: