తొందరలోనే చంద్రబాబునాయుడుకు  మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు షాక్ ఇస్తారనే ప్రచారం రోజురోజుకు పెరిగిపోతోంది. అందుకు కారణం ఏమిటంటే గుంటూరు జిల్లాలో ప్రత్తిపాటి నియోజకవర్గమైన చిలకలూరుపేటలో చంద్రబాబు పర్యటనకు మాజీ మంత్రి డుమ్మా కొట్టటంతో ప్రచారం మరింతగా పెరిగిపోయింది.

 

మొన్నటి ఎన్నికల్లో ప్రత్తిపాటి వైసిపి అభ్యర్ధి విడదల రజని చేతిలో ఓడిపోయారు. అప్పటి నుండి మాజీ మంత్రిలో కూడా ఆందోళన పెరిగిపోతోంది. ఇంతకీ మాజీమంత్రిలో ఆందోళన ఎందుకంటే ఆయనపై ఉన్న కేసులు, ఆరోపణలే ప్రధాన కారణం. గుంటూరు మార్కెట్ యార్డులో గతంలో పత్తి కొనుగోలులో భారీగా జరిగిన అక్రమాల్లో మాజీమంత్రిదే ప్రధాన పాత్రగా ఆరోపణలున్నాయి.

 

ఇక అగ్రిగోల్డ్ భూములను అక్రమంగా పుల్లారావు సొంతం చేసుకున్నారంటూ ప్రతిపక్షంలో ఉన్నపుడు స్వయంగా జగన్మోహన్ రెడ్డి ఆరోపించిన విషయం తెలిసిందే. జగన్ అధికారంలోకి రాగానే చంద్రబాబునాయుడు హయాంలో జరిగిన అవినీతి, అక్రమాలు, అవకతవకలపై విచారణ చేయిస్తున్నారు. ఆ విచారణల్లో ప్రత్తిపాటి ఇరుక్కోవటం ఖాయమంటున్నారు.

 

దాంతో పుల్లారావులో టెన్షన్ పెరిగిపోతోంది. ఏ కేసును ముట్టుకున్నా మాజీ మంత్రి తగులుకోవటం ఖాయమనే ప్రచారం పెరిగిపోతుండటంతో టిడిపికి రాజీనామా చేయాలని డిసైడ్ అయ్యారట. టిడిపికి తొందరలోనే రాజీనామా చేసేసి బిజెపిలో చేరుతారనే ప్రచారం పార్టీలోనే బాగా వినిపిస్తోంది. ఇప్పటికైతే ఆ ప్రచారాన్ని పుల్లారావు ఖండిస్తున్నా దాన్నెవరూ నమ్మకపోవటమే విచిత్రంగా ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: