చూడబోతే అలాగే ఉంది కేంద్ర హోంమంత్రి కిషన్ రెడ్డి మాటలు వింటుంటే. వచ్చే ఎన్నికల్లో తెలుగు రాష్ట్రాల్లో బిజెపి జెండా ఎగరేస్తామంటూ కిషన్ చెప్పిన మాటలపై చర్చ మొదలైంది. నిజానికి తెలుగురాష్ట్రాల్లో బిజెపి ఉనికి చాలా తక్కువనే చెప్పాలి. ఏదో మొన్నటి ఎన్నికల్లో అనూహ్యంగా తెలంగాణాలో నాలుగు ఎంపి సీట్లు గెలవటంతో బిజెపి నేతలు రెచ్చిపోతున్నారు.

 

ఉమ్మడి రాష్ట్రంలో కూడా బిజెపి ఎక్కడైనా ఉందంటే అది తెలంగాణాలో మాత్రమే. అది కూడా హైదరాబాద్ పరిధిలోనే అన్న విషయం అందరికీ తెలిసిందే. మొన్నటి ఎన్నికల్లో కెసియార్ తప్పిదాల వల్లే తెలంగాణాలో బిజెపి నాలుగు ఎంపి సీట్లలో గెలిచింది. అంతుకుముందు జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఇదే బిజెపి 119 సీట్లలో పోటీ చేస్తే గెలిచింది ఒక్క నియోజకవర్గంలో మాత్రమే.

 

ఇక ఏపి విషయాని వస్తే ఎప్పుడైనా బిజెపి గాలున్నపుడు మాత్రమే ఆ పార్టీకి ఓ నాలుగు సీట్లు వస్తాయి. లేకుండా అదీ లేదు. 2014లో చంద్రబాబానాయుడుతో ఉన్న కారణంగా రెండు ఎంపి సీట్లు, నాలుగు ఎంఎల్ఏలను బిజెపి గెలుచుకుంది.  ఈ విజయంతోనే 2019లో తమ పార్టీనే ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తుందంటూ రెచ్చిపోయి మాట్లాడారు బిజెపి నేతలు.

 

2019 ఎన్నికల్లో కూడా మొత్తం 175 అసెంబ్లీ, 25 పార్లమెంటు సీట్లలో పోటీ చేసింది. కానీ ఎక్కడా ఒక్కసీటు కూడా గెలవలేదు. ఓట్లశాతం కూడా 1 లోపే. దేశవ్యాప్తంగా నరేంద్రమోడి హవా కనిపించినా ఏపిలో మాత్రం జగన్మోహన్ రెడ్డి దెబ్బకు బిజెపి చాపచుట్టేసింది. వాస్తవాలు కళ్ళముందు కనిపిస్తున్నా వచ్చే ఎన్నికల్లో ఏపిలో జెండా ఎతరేస్తుందని కిషన్ రెడ్డి చెప్పటమంటే విచిత్రంగానే ఉంది వినటానికి.

 

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: