కడప జిల్లా పర్యటనలో ఉన్న సీఎం జగన్.. గండి క్షేత్రాంలో పూజలు నిర్వహించారు. ఉద్యం 10.46 నిమిషాలకు జగన్ గండి క్షేత్రాన్ని చేరుకున్నారు. ఆలయం వద్ద వేద పండితులు పూర్ణ కుంభంతో, వేద మంత్రోచ్ఛారణలతో ముఖ్యమంత్రిని స్వామివారి దర్శనానికి తీసుకెళ్లారు.భక్తిశ్రద్ధలతో స్వామివారికి జగన్ పూజలు నిర్వహించారు.

ఆలయ మండపంలో వేద ఆశీర్వచనం చేసి ముఖ్యమంత్రికి తీర్థప్రసాదాలు అందజేశారు వేదపండితులు. ఆలయ సమీపంలో రూ. 3.51 కోట్లతో గండి క్షేత్రం మరియు ఆలయం అభివృద్ధికి సంబంధించి మూడు శిలాఫలకాలను, పులివెందులలో డా. వైయస్సార్ ఉద్యానవన యూనివర్సిటీకి అనుబంధంగా ఏర్పాటు చేస్తున్న అరటి పరిశోధన కేంద్రంనకు సంబంధించి ఒక శిలాఫలకాన్ని ముఖ్యమంత్రి ఆవిష్కరించారు.

గండిక్షేత్రానికి సంబంధించి ఆలయ దక్షిణ భాగంలోని రాజగోపురం, ప్రాకారాల నిర్మాణానికి రూ. 2.64 కోట్లు, ఆలయం లోని అన్నదానం గది, వంటగది, స్టోర్ రూమ్ ఆఫీస్ కార్యాలయం పునరుద్ధరణ పనుల కొరకు రూ. 48.20 లక్షలు, గండి క్షేత్రం లో సాంస్కృతిక కార్యక్రమాల మండపము, షెల్టర్ నిర్మాణాలకు రూ. 39.50 లక్షలతో 3 శిలాఫలకాలను సీఎం ఆవిష్కరించారు.

పులివెందులలో డా. వైయస్సార్ ఉద్యానవన యూనివర్సిటీకి అనుబంధంగా ఏర్పాటు చేస్తున్న అరటి పరిశోధన కేంద్రంనకు సంబంధించి మరో శిలాఫలకాన్ని ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ అవినాష్ రెడ్డి ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: