ఇటీవల తెలంగాణలో ఇంటర్ ఫలితాల్లో ఎన్నో అవకతవకలు జరిగాయి.  ఎంతో మెరిట్ విద్యార్థులు సైతం దారుణమైన ఫలితాలు పొందారు. కొంత మందికైతే సింగిల్ డిజిట్ రావడంతో మనస్థాపానికి లోనై ఆత్మహత్యలు చేసుకున్నారు.  ఈ నేపథ్యంలో ఇంటర్ బోర్డు, గ్లోబరినాపై కఠిన చర్యలు తీసుకోవాలని కోర్టుని ఆశ్రయించారు. 

తాజాగా హైకోర్టు లో ఇదే అంశంపై పిటీషన్ ను కొట్టివేశారన్న సుప్రీంకోర్టు.  తెలంగాణ లో ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్య లపై సుప్రీంకోర్టులో టీషన్. ఇదే విషయంపో హైకోర్టు లో వాదోపవాదాలు జరిగాయి. తమ పిల్లల అన్యాయంగా మార్కుల విషయంలో మనస్థాపానికి గురై చనిపోయారని తల్లిదండ్రులు వాదించిన విషయం తెలిసిందే.  

 హైకోర్టు లో  ఈ కేసు విషయంలో వాదోపవాదాలు జరుగుతూనే ఉన్నాయి. హైకోర్టు లో జరిగిన వాదనలే  సుప్రీం కోర్టు కొనసాగించడం ఎంతమాత్రం కుదరదని సుప్రీం కోర్టు తేల్చి చెప్పింది.  ఈ నేపథ్యంలో తెలంగాణ విద్యార్థులు, తల్లిదండ్రులు ఎలా స్పందిస్తారో ఎంత వరకు న్యాయం లభిస్తుందో చూడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: