2019 ఎన్నికలలో గెలిచిన తరువాత వైసీపీ ప్రభుత్వం రైతులకు మేలు జరిగేలా ఎన్నో నిర్ణయాలు తీసుకుంటుంది. అక్టోబర్ నెల 15 వ తేదీ నుండి ఆంధ్ర ప్రదేశ్ రైతులకు పెట్టుబడి సాయం కోసం 12,500 రుపాయలు పెట్టుబడి సాయం అందించబోతుంది వైసీపీ ప్రభుత్వం. రైతులకు పగటి పూటే 9 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్తు అందించబోతుంది. రైతులకు వడ్డీ లేని పంట రుణాలు అందించే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి.

 

ఇవి కాక గత ప్రభుత్వం పెట్టిన బకాయిల్లో 360 కోట్లు వైసీపీ ప్రభుత్వం ఇప్పటికే విడుదల చేసింది. ఆత్మహత్య చేసుకున్నా లేక ప్రమాదవశాత్తు మరణించిన రైతులకు 7 లక్షల భీమా సౌకర్యం కల్పిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డిగారి సొంత నియోజకవర్గమైన పులివెందులలో అరటి పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. అక్వా రైతులకు రుపాయిన్నరకే కరెంట్ ఇవ్వబోతుంది వైసీపీ ప్రభుత్వం.

 

రైతుల పంటల యొక్క భీమా కోసం కోటీ 38 లక్షల ఎకరాలకు 2163 కోట్ల ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లించబోతోంది వైసీపీ ప్రభుత్వం. ఇవే కాక రైతుల కోసం ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేయబోతున్నారు. ఇలా వైసీపీ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు రైతులకు మేలు చేకూర్చే విధంగా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో గతంలో ఏ ప్రభుత్వం కూడా రైతుల సంక్షేమం కోసం ఇన్ని మంచి నిర్ణయాలైతే తీసుకోలేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: