కేసీఆర్ ప్రభుత్వ  నిర్ణయాన్ని హైకోర్టు తప్పుపట్టింది . గతంలోనూ కేసీఆర్ సర్కార్ తీసుకునున్న పలు వివాదస్పద నిర్ణయాలను హైకోర్టు తప్పుపడుతూ , మొట్టికాయలు వేసిన విషయం తెల్సిందే . తాజాగా సచివాలయాన్ని కూల్చి నూతన సచివాలయాన్ని నిర్మించాలన్న కేసీఆర్ సర్కార్ నిర్ణయాన్ని తప్పు పట్టడమే కాకుండా , సచివాలయ భవనాలను కూల్చవద్దని ఆదేశించింది . అదే విధంగా ఎర్రమంజిల్ భవనాన్ని కూల్చి అసెంబ్లీ నిర్మించాలన్న కేసీఆర్ సర్కార్ నిర్ణయాన్నికూడా  హైకోర్టు తప్పుపట్టడం తో మరోసారి సర్కార్ నిర్ణయానికి కోర్టులో చుక్కెదురయినట్లయింది .  


సచివాలయm ఎర్రమంజిల్ లోని భవనాలను ఎట్టిపరిస్థితుల్లో కూల్చవద్దన్న హైకోర్టు,  తాము తదుపరి ఉత్తర్వులు వెలువరించేవరకు పాత భవనాల జోలికి వెళ్లవద్దని స్పష్టం చేసింది . సచివాలయ, ఎర్రమంజిల్ భవనాలను కూల్చి కొత్త భవనాలను నిర్మించడాన్ని వ్యతిరేకిస్తూ పలువురు దాఖలు చేసిన పిటిషన్ నేడు హైకోర్టు లో విచారణకు రాగా ,  ప్రభుత్వం తరుపు న్యాయవాది తమకు కౌంటర్ దాఖలు చేయడానికి 15 రోజులపాటు గడువు ఇవ్వాలని కోరగా , న్యాయమూర్తి తిరస్కరించి ఈ రోజే వాదనలు వినిపించాలని ఆదేశిం చారు .


అసెంబ్లీ , సచివాలయం కోసం నూతన భవనాలను నిర్మించాలని కేసీఆర్ సర్కార్ నిర్ణయించగా , రాష్ట్రం లోని విపక్షాలు , ప్రజాసంఘాలు ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించాయి . ప్రస్తుత సచివాలయ భవనాలను కూల్చాల్సిన అవసరం లేదని విపక్ష కాంగ్రెస్ , బీజేపీ నేతలు అంటున్నారు . ప్రభుత్వం ప్రజాధనాన్ని వృధా చేసి , చక్కగా ఉన్న భవనాలను కూల్చి కొత్తవాటిని నిర్మించాలనుకోవడం హాస్యాస్పదంగా ఉందని వారు విమర్శిస్తున్నారు అయితే   విపక్ష కాంగ్రెస్ , బీజేపీ నేతల వాదనలు అర్థరహితమని , భావితరాల అవసరాల కోసమే కేసీఆర్ నూతన అసెంబ్లీ , సచివాలయ భవనాలను నిర్మించాలని నిర్ణయించారని తెరాస నేతలు చెబుతున్నారు .


మరింత సమాచారం తెలుసుకోండి: