త‌న సొంత జిల్లా క‌డ‌ప‌పై సీఎం జ‌గ‌న్ వ‌రాల జ‌ల్లు కురిపించారు. నిజానికి ప్ర‌తిప‌క్ష నేత‌గా ఉన్న‌స‌మయంలో అప్ప‌టి సీఎం చంద్ర‌బాబు కూడా క‌డ‌ప‌పై అనేక రూపాల్లో వ‌రాల వ‌ర్షం కురిపించారు. ప‌ట్టిసీమ ద్వారానేరుగా జ‌గ‌న్‌ సొంత నియోజ‌క‌వ‌ర్గం పులివెందుల‌కు నీటిని అందించారు. క‌డ‌ప ఉక్కు ఫ్యాక్ట‌రీకి శంకు స్థాప‌న చేశారు. క‌డ‌ప‌లో కేంద్ర సంస్థ‌ల ఏర్పాటు కు కృషి చేశారు. ఇలా జ‌గ‌న్ సొంత జిల్లాపై బాబు త‌న‌దైన ముద్ర వేసేందుకు ప్ర‌య‌త్నించారు. స‌రే! ఇదంతా కూడా రాజ‌కీయం కోసం బాబు చేసిన ప్ర‌య‌త్నంగానే అంద‌రూ చూశారు. 


ఇక‌, ఇప్పుడు సీఎం అయిన జ‌గ‌న్‌.. త‌న జిల్లాప పెద్ద‌గా ఫోక‌స్ పెట్టారు. తాజాగా త‌న తండ్రి వైఎస్ జ‌యంతిని పుర‌స్క‌రించుకుని జ‌గ‌న్ సొంత జిల్లా క‌డ‌ప‌లో కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న జిల్లాపై త‌నకున్న ఆప్యాయ‌త‌ను వెల్ల‌డించారు. తాను రానున్న రెండున్న‌రేళ్ల‌లో ఏం చేయ‌ద‌లు చుకున్న‌దీ వివ‌రించారు.  రైతు దినోత్సవం సందర్భంగా ఆయన కడప జిల్లాలోని జమ్మలమడుగులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజల సమస్యలను ఉద్దేశించి జగన్‌ పలు హామీలు ఇచ్చారు. 


కడప ఉక్కు పరిశ్రమ ఏ పనీ జరగక ఆగిపోయిన పరిస్థితిలో ఉంద‌ని, డిసెంబర్‌ 26న వచ్చి.. అదే ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేస్తానని హామీ ఇచ్చారు. మూడేళ్ల లోనే ఆ ప్రాజెక్టును పూర్తిచేసి మీ అందరికీ అందిస్తానని మాటిచ్చారు.  ఈ ప్రాజెక్టు ద్వారా 20వేల మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుందని తెలిపారు.  
అదేవిధంగా.. కుందూ నదిపై రాజోలి జలదరాశి ప్రాజెక్టును సైతం పూర్తిచేస్తామ‌న్నారు.  సాగునీటి కోసం కుందూ నదిపై జలదరాశి ప్రాజెక్టు కడతామ‌న్నారు. దీనికి కూడా డిసెంబర్‌ 26న శంకుస్థాపన చేస్తామ‌ని చెప్పారు. 


వెలుగోడు నుంచి 100 కి.మీ దూరంలో ఉన్న ఈ బ్రహ్మంసాగర్‌కు నీళ్లు అందని పరిస్థితి కళ్లముందే కనబడుతున్నా పట్టించుకొనే నాథుడేలే డని చెప్పిన జ‌గ‌న్‌.. దీనిని కూడా త్వ‌ర‌లోనే పూర్తిచేస్తామ‌ని హామీ ఇచ్చారు. చెన్నూరు చక్కెర ఫ్యాక్టరీని తెరిపించేం దుకు చర్యలు తీసుకుంటున్న‌ట్టు చెప్పారు. గండి కోట రిజర్వాయర్‌లో ఈ సంవత్సరం 20 టీఎంసీలు నీరు నిల్వచేసే కార్యక్రమానికి శ్రీకారం చుడతామ‌న్నారు. గండికోట నిర్వాసితులకు ఆర్‌ఆర్‌ ప్యాకేజీ ఇవ్వ‌నున్న‌ట్టు హామీ ఇచ్చారు.  రైతులకు తోడుగా ఉంటామ‌ని పున‌రుద్ఘాటించారు. మొత్తానికి త‌న సొంత జిల్లాపై టార్గెట్ డిసెంబ‌ర్ 26ను అమ‌లు చేసేందుకు జ‌గ‌న్ నిర్ణ‌యించ‌డంపై క‌డ‌ప వాసులు ఆనందం వ్య‌క్తం చేస్తున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: