అడవి బిడ్డ పాటకు మోడీ ఫిదా..!!
మారుమూల పల్లెలో వెనుకబడిన వర్గం నుంచి వచ్చిన గుజరాతీ ఫోక్‌ సింగర్‌ గీతా రబారీ యువతకు స్ఫూర్తిగా నిలిచిందని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు. గీతా రబారీ ఈరోజు పార్లమెంట్‌లో ప్రధాని నరేంద్ర మోడీని కలిసి,ఆయనకు సంప్రదాయ తలపాగా అందజేసింది.
ఎన్నో కష్టాల నుండి ఎదిగిన గీతారబారీ సమాజానికి స్ఫూర్తిదాయకమని ప్రధాని వ్యాఖ్యానించారు.
రూ.250 బహుమతిగా ...
మోడీని కలిసిన అనంతరం ఓ పాట పాడి ఆయనకు అంకితమిచ్చింది గీతా రబారీ. '' చిన్నతనంలో పాఠశాలలో ఉన్నప్పుడే మోడీ ని కలిశాను, ఆ సమయంలో తనకు రూ.250 బహుమతిగా ఇచ్చారు '' అని ఆమె గుర్తు చేసుకుంది.

గీతా రబారీ పాడిన పాట వీడియోను మోడీ ట్విట్టర్‌లో షేర్‌ చేశారు. ట్విటర్‌లో ఆయన స్పందిస్తూ..' అత్యంత ప్రజాదరణ పొందిన వ్యక్తిగా గీతా ఎదిగారని, ఆమె నేటి యువతకు స్ఫూర్తిదాయకం, గుజరాతీ జానపదాన్ని ప్రపంచానికి పరిచయం చేయడానికి ఎంతో శ్రమ పడుతున్నారు..'' అని ప్రశంసించారు.
ఆమె గుజరాత్‌ అడవుల్లో నివసించే మల్ధారీ తెగకు చెందిన మహిళ.


మరింత సమాచారం తెలుసుకోండి: