మధ్యాహ్నం భోజనంలో పురుగులు..? 
చిన్నారులకు తయారు చేసే మధ్యాహ్న భోజనంలో పురుగులు వచ్చిన సంఘటర ఆందోళనగా మారింది. విద్యార్దులంతా కలెక్టరేట్‌ ముందు ధర్నాకు దిగారు. ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థులు నిరసనకు దిగారు.

మధ్యాహ్న భోజనంలో నాసిరకమైన బియ్యం, కూరగాయలు వాడుతున్నారని, పురుగుల అన్నం పెడుతున్నారని ఆందోళనకు దిగారు.ఈ రోజు మధ్యాహ్నం పాఠశాలలో విద్యార్థులు అన్నం తింటుండగా పురుగులు కనిపించాయి. దీంతో ఖంగారు పడటం విద్యార్థులవంతైంది. '' గిదేమి అన్నం...?'' అని మధ్యాహ్నం భోజనం వండించిన వారిని ప్రశ్నించగా.. నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు.

దీంతో విద్యార్థులు కలెక్టరేట్‌ ఎదుట ధర్నాకు దిగారు. తమకు పురుగుల అన్నం పెడుతున్నారంటూ తాము తినే ఆహారాన్ని కలెక్టర్‌కు చూపించారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్నారు.

విద్యార్థుల ఆందోళనకు స్పందించిన కలెక్టర్‌ దివ్య దేవరాజన్‌ వెంటనే ,పాఠశాలను సందర్శించి పరిస్థితులను పరిశీలించాలని విద్యాశాఖాధికారిని ఆదేశించారు. మరోసారి ఇలాంటి పరిస్ధితి రాకూడదని హెచ్చరించారు. (  imaginary pic /google)


మరింత సమాచారం తెలుసుకోండి: