జగన్ రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేస్తున్నాడు. వైసీపీ విజయం అద్భుతం  అనుకుంటే జగన్ నెల రోజులలో తీసుకుంటున్న ఒక్కొక్క నిర్ణయం కూడా రికార్డు. మొత్తం నలభై రోజుల పాలనలో  జగన్ ఏడాది పాలనలో కూడా తీసుకోలేని నిర్ణయాలు తీసుకుని శభాష్ అనిపించుకున్నారు.


ఇదిలా ఉండగా ఉమ్మడి ఏపీ సీఎం గా పనిచేసిన ముఖ్యామంత్రి వైఎస్సార్ నాటికి ఉన్న ఏపీ బడ్జెట్ ని లక్ష కోట్లకు దాటించి కొత్త రికార్డ్ క్రియేట్ చేశారు.   అప్పట్లో రాష్ట్రాలో బడ్జెట్  లక్ష కోట్లు  అంటే ఓ విధంగా సంచలనమే. కేంద్ర బడ్జెట్ కూడా తక్కువగా ఉన్న రోజులవి. మరి దాన్ని సునాయాసంగా దాటించేసి భారీ కేటాయింపులతో వైఎస్సార్ తన మార్క్ చూపించారు.


ఇపుడు తనయుడు జగన్ వంతు వచ్చింది. జగన్ కూడా తండ్రి లాగానే చేతికి ఎముక లేనట్లుగా వ్యవహరిస్తున్నారు. ఆయన కూడా సంక్షేమ కార్యక్రమాలకు పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేస్తున్నారు. దాంతో మరో రికార్డ్ కి ఏపీ సర్కార్ రెడీ అవుతోంది. రెండు లక్షల 26 వేల కోట్లతో జగన్ బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. 


ఇప్పటికైతే ఇది ఏపీకి సంబంధించి రికార్డ్. టీడీపీ బడ్జెట్ ఇంతలా ప్రవేశపెట్టలేకపోయింది. ఓ విధంగా బడ్జెట్ పెరగడం అంటే దాన్ని సాధించే దమ్మూ ధైర్యం పాలకులకు ఉండాలి, జగన్ ఎటూ హామీలు ఇచ్చి తప్పుకునే రకం కాదు కాబట్టి మొత్తం బడ్జెట్ నిధులను ఏ విధంగా తెచ్చుకుంటారో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: