చంద్రబాబు ప్రభుత్వం అధికారంలో ఉండగా ఈడీ గాంధీ హవా నడిచింది.  అధినేత బాబుపై వచ్చిన ఫిర్యాదులను నీరుగార్చడం దగ్గరి నుంచి ప్రత్యర్థులపై కేసులు పెట్టె విషయంలో చురుగ్గా వ్యవహరించడం వరకు గాంధీ చూసుకునేవారు.  ఏడేళ్ల పాటు ఈడీ లో తనదైన శైలిలో చక్రం తిప్పాడు.  అప్పట్లో జగన్ పై కేసులు పెట్టించి జగన్ ను పరుగులు పెట్టించింది గాంధీనే.  


ఇప్పుడు ఈ గాంధీ అడ్డంగా దొరికిపోయారు.  రెగ్యులర్ చెకప్ లో భాగంగా సీబీఐ అధికారులు గాంధీ కి సంబంధించిన హైదరాబాద్, విజయవాడలో తనిఖీలు నిర్వహించారు.  ఈ తనిఖీల్లో ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నట్టు తేలింది.  దీంతో ఆయనపై సిబిఐ కేసులు నమోదు చేసింది.  


బాబుకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే పక్కా సమాచారంతో మోడీ ప్రభుత్వం ఆయన్ను జీఎస్టీ విభాగానికి బదిలీ చేసిన సాగండి తెలిసిందే.  జిఎస్టి విభాగంలో పనిచేసే సమయంలో ఇలా సిబిఐ అధికారులకు దొరికిపోయారు. దాదాపు 3.75 కోట్ల రూపాయలు ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయని చెప్పి ఆయనపై కేసులు నమోదు చేశారు. 


అసలు ఆయనపై ఇలా దాడులు జరగడానికి కారణాలు ఉన్నాయి.  జగన్ పై నమోదైన ఆదాయానికి మించిన ఆస్తుల కేసు దర్యాప్తు ఏళ్ల తరబడి నడుస్తుంటే... అదేదో కొత్తగా ఇప్పుడే కనుక్కున్నట్లు జగన్ సతీమణి వైఎస్ భారతి రెడ్డికి కూడా నోటీసులు జారీ చేయించిన ఘనత గాంధీది. ఈ క్రమంలో గాంధీపై జగన్ నేరుగా కేంద్ర ప్రభుత్వానికే ఫిర్యాదు చేశారు.

కోర్టులో చార్జీషీట్లు దాఖలైన ఐదారేళ్లకు కొత్తగా భారతి రెడ్డికి నోటీసులు జారీ కావడం వెనుక గాంధీ కక్షపూరిత వైఖరే కారణమని జగన్ కేంద్రానికి ఫిర్యాదు చేశారు. ఇలా జగన్ ఫిర్యాదు చేసిన తరువాత జరిగిన దాడుల్లో గాంధీ అడ్డంగా దొరికిపోవడం విశేషం.  


మరింత సమాచారం తెలుసుకోండి: