మరో రెండు రోజుల్లో అసీంబ్లీలో బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. అయితే ఈ సమావేశాలను ఎలాగైనా అడ్డుకోవాలని టీడీపీ నాయకత్వం భావిస్తుంది. బడ్జెట్ పై అర్థవంతమైన చర్చ జరిగితే అది వైసీపీకే మేలు చేస్తుంది. జగన్ విజన్ ఏంటి అనేది ప్రజలకు క్లియర్ గా తెలుస్తుంది. అందుకే టీడీపీ ఈ అవకాశాన్ని తమ స్వార్థం కోసం వాడుకోవడానికి సిద్ధమైంది. అసెంబ్లీలో వీలైనంత గొడవ జరగాలి. వీలైతే మార్షల్స్ తో బైటకు నెట్టించుకుని సింపతీ క్రియేట్ చేసుకోవాలి.


మా బిల్డింగ్ లు కూలగొట్టేస్తున్నారు, మమ్మల్ని మెడబట్టి బైటకు గెంటేస్తున్నారంటూ మరోసారి గగ్గోలు పెట్టాలి. ఇదీ టీడీపీ ఎమ్మెల్యేల ప్రధాన అజెండా. ఈ మేరకు ఇప్పటికే పార్టీ అధినాయకత్వం ఎమ్మెల్యేలకు సూచనలు ఇచ్చేసింది. అసెంబ్లీలో వీలైనంత ఎక్కువగా రెచ్చిపోవాలని చెప్పింది. గతంలో వైసీపీ నేతల్ని మాట్లాడనీయకుండా చేసి, ఆ తర్వాత వారు స్వచ్ఛందంగా అసెంబ్లీ సమావేశాలను బాయ్ కాట్ చేసేలా చేసింది టీడీపీ.


ఆ తర్వాత తమ ఇష్టానురాజ్యం, కల్లబొల్లి కబుర్లతో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించుకుంది. కానీ జగన్ అలా చేయనని ముందే చెప్పారు. వీలైనంత ఎక్కువ సమయం ప్రతిపక్షానికి ఇస్తానని చెప్పారు. అసెంబ్లీలో తమ ప్రసంగాలకు అడ్డు తగిలినా ఓర్పుగానే వ్యవహరించారు. ఇదే టీడీపీకి మింగుడుపడని అంశంగా మారింది. ఎలాగోలా వైసీపీ నేతల్ని రెచ్చగొట్టి, సభలో గొడవచేసి, బైటికెళ్లిపోవాలని టీడీపీ ఆలోచిస్తోంటే.. వైసీపీ మాత్రం సంయమనంతో వ్యవహరిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: