దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఇబ్బంది కరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నది.  ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో ఓటమిపాలైన కాంగ్రెస్,గత ఎన్నికల్లో దారుణంగా దెబ్బతిన్నది.  దక్షిణాదిన కేరళ, కర్ణాటకలో మాత్రమే అధికారంలో ఉన్నది.  కర్ణాటకలో కూడా సంకీర్ణం.  


2018 లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 72 స్థానాల్లో విజయం సాధించగా బీజేపీ 105 చోట్ల స్థానాలు గెలుచుకుంది.  జేడీఎస్ 37 చోట్ల విజయం సాధించింది. బీజేపీ కి అవకాశం ఇవ్వకూడదు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ, జేడీఎస్ తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.  జేడీఎస్ కు ముఖ్యమంత్రి పదవిని ఇచ్చింది.  


కొంతకాలం సవ్యంగానే జరిగింది.  ఇప్పుడే అసలైన ఇబ్బంది మొదలైంది.  కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు రాజీనామాలు చేశారు.  జేడీఎస్ కు చెందిన కొంతమంది ఎమ్మెల్యేలు రాజీనామాలు చేశారు.  దీంతో ప్రభుత్వం మైనారిటీలో పడింది.  ఎమ్మెల్యేల రాజీనామాలపై ఇంకా గవర్నర్ నిర్ణయం తీసుకోలేదు.  


ఒకవేళ తీసుకుంటే కాంగ్రెస్ పార్టీ ఇరకాటంలో పడుతుంది.  అక్కడ బుజ్జగింపు ప్రయత్నాలు మొదలయ్యాయి.  ఎలాగైనా రాజీనామాలు చేసిన వ్యక్తులను రాజీనామాలను వెనక్కి తీసుకునే విధంగా చేయాలని చూస్తున్నారు మరి ఇది సాధ్యం అవుతుందా చూడాలి.  


మరింత సమాచారం తెలుసుకోండి: