రేపటి నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. గత ప్రభుత్వం తరహాలో కాకుండా అందరికీ అవకాశం కల్పించేలా సమావేశాలు నిర్వహించాలని జగన్ సర్కారు భావిస్తోంది. అసెంబ్లీ నిర్వహణలో కొత్త పుంతలు తొక్కాలని ప్రయత్నిస్తోంది.


పనిలో పనిగా ఓ కొత్త రికార్డు కోసం జగన్ టీమ్ ప్రయత్నిస్తోంది. గత ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాలను గరిష్ఠంగా ఏడాదికి 105 రోజులపాటు నిర్వహించింది. ఇప్పుడు ఆ రికార్డును అధిగమించేందుకు ప్రయత్నిస్తామని కొత్త స్పీకర్ తమ్మినేని సీతారాం చెబుతున్నారు.


ఇటీవలి కాలంలో ఏడాదిలో 50-55 రోజుల్లోపే సమావేశాలు నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. ఈ సంఖ్య క్రమంగా పెంచుకుంటూ పోవాలని చూస్తున్నామని ఆయన అంటున్నారు. ప్రతిరోజూ ప్రశ్నోత్తరాల సమయం కొనసాగిస్తామంటున్నారు.


గత ప్రభుత్వ హయాంలో అధికారపక్షం విపక్షం గొంతు నొక్కేసింది. దీంతో అప్పటి విపక్షనేత జగన్ ఏకంగా అసెంబ్లీ సమావేశాలనే బహిష్కరించారు. కానీ ఆసారి తాము అలా చేయబోమంటున్నారు సభాపతి. పార్లమెంటరీ ప్రజాస్వామ్య విధానంలో సభ్యుల సంఖ్య ఆధారంగా సభలో ఆయా పక్షాలకు సమయాన్ని కేటాయిస్తామంటున్నారు.


అయితే అసంబద్ధ అంశాలపై సభాసమయాన్ని వృథా చేయడానికైతే అవకాశమివ్వం అంటూ తేల్చే చెబుతున్నారు స్పీకర్ తమ్మినేని సీతారామ్ . బడ్జెట్‌ సమావేశాలు నెలాఖరు వరకు జరిగే అవకాశం ఉందని... అవసరమైతే సభా సమావేశాలను మరికొన్ని రోజులు పొడిగిస్తామని ఆయన చెబుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: