రెండు చేతులు కలిస్తేనే శబ్దం వస్తుంది.. ప్లస్ మైనస్ ఉంటేనే కరెంట్ పుడుతుంది.  స్త్రీ పురుషులు కలిస్తేనే కొత్త సృష్టి జరుగుతుంది.  సృష్టికి విరుద్ధంగా పోతాం అంటే కుదరదు.  ఇప్పుడు ఎక్కువగా సృష్టికి విరుద్ధంగానే నడుస్తున్నది. మనసులు కలిశాయని అమ్మాయి అమ్మాయిలు పెళ్లి చేసుకోవడం, అబ్బాయి అబ్బాయిలు పెళ్లి చేసుకోవడం వంటివి జరుగుతున్నాయి.  


ఇలా చేయడం నేరం అనే కంటే సృష్టికి విరుద్ధం అని చెప్పొచ్చు.  అబ్బాయి అబ్బాయిలు, అమ్మాయి అమ్మాయిలు పెళ్లి చేసుకుంటారని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో ఎప్పుడో చెప్పారు.  ఇప్పుడు అది నిజమయ్యేలా కనిపిస్తోంది.  అయ్యేలా కనిపించడం కాదు అవుతున్నది.  


రీసెంట్ గా అమెరికాలో ఇద్దరు భారతీయ యువకులు వివాహం చేసుకున్నారు.  అది కుటుంబ సభ్యుల సమక్షంలో.  దీంతో అందరు షాక్ అవుతున్నారు.  వైభవ్ అనే వ్యక్తి 2011 లో అమెరికా వెళ్లి అక్కడ రీసెర్చ్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నాడు.  ఈ యువకుడికి అమెరికాలో పుట్టి పెరిగిన పరాగ్ మెహతా అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది.  ఆ పరిచయం ప్రేమగా మారింది.  


ఇద్దరి మనసులు కలిశాయి.  జైన సంప్రదాయం ప్రకారం ఆ ఇద్దరు వివాహం చేసుకున్నారు.  టెక్సాస్ లో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది.  భారత్ లో ఇలా ఇద్దరు మగాళ్లు లేదా ఆడవాళ్లు వివాహం చేసుకోవడం నేరం.  సెక్షన్ 377 కింద వారిపై కేసు నమోదు చెయ్యొచ్చు. కొన్ని దేశాల్లో మాత్రం గే మ్యారేజ్ లకు అనుమతి ఇచ్చారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: