ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, కొద్దిసేపటిక్రితం 2019-20 ఆర్థిక సంవత్సరపు పూర్తి స్థాయి ప్రతిపాదనలను అసెంబ్లీ ముందుకు తీసుకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..రాష్ట్రంలో ఎంతో మంది నిరుపేదలు కనీస ఇంటి వసతి లేకుండా ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని.. అలాంటి వారికోసం శుభవార్త అంటూ తన ప్రసంగంలో పలు సంచలన విషయాలు ప్రస్తావించారు.  రాష్ట్రంలో  అర్హులైన 25 లక్షల మందికి వచ్చే ఐదేళ్లలో ఇళ్లను నిర్మించాలని ఏపీ ప్రభుత్వం ప్రవేశ పెట్టింది.

ఆయన బడ్జెట్ ప్రతిపాదనలో గృహ నిర్మాణానికి పెద్ద  పీట వేస్తామని  ఏపీ ప్రభుత్వం ప్రకటించారు. ఇళ్లు లేని నిరుపేదలకు 25 లక్షల ఇళ్ల స్థలాల పట్టాలను పంపిణీ  చేస్తామన్నారు. 2020 మార్చి 25 నాటికి 25 లక్షల మందికి ఇళ్ల పట్టాలను అందించనున్నట్టు మంత్రి ప్రకటించారు.  మహిళల పేరు మీదే  ఇళ్ల స్థలాల పట్టాలను ఇస్తామన్నారు.  వైసీపీ విజన్ ను సాకారం చేసే దిశగా, రాష్ట్రాభివృద్ధే లక్ష్యంగా ఈ బడ్జెట్ ను తయారు చేసినట్టు ఆయన తెలిపారు.

నవరత్నాల అమలే ప్రభుత్వ బడ్జెట్‌ అని, ఎన్నికల సందర్భంగా ప్రకటించిన మ్యానిఫెస్టోను అమలు చేసి తీరుతామని అన్నారు.ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ కోసం ప్రభుత్వ భూములతో పాటు అవసరమైతే ప్రైవేట్ భూములను కూడ సేకరిస్తున్నట్టుగా  ప్రభుత్వం ప్రకటించింది. గత ఐదేళ్లలో  పట్టణ ప్రాంతాల్లో 91,119 ఇళ్లను నిర్మించారన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో 7,04,916 ఇళ్లను నిర్మించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: