కర్ణాటక రాజకీయాలు రోజుకో కొత్త మలుపు తిరుగుతున్నాయి. మొదట నలుగురు ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించారంటూ వచ్చిన వార్తలు చివరకు 16 మంది సభ్యులు రాజీనామాలకు సిద్ధపడ్డారు. స్పీకర్ టెబుల్ పై తమ రాజీనామాలు ఉంచినా ఏలాంటి నిర్ణయం తీసుకుకోకపోవడంతో గవర్నర్ ను కలిసి తమ రాజీనామాలు సమర్పించారు. గవర్నర్ సానుకూలంగా స్పందించగా తిరిగి రాజీనామాలపై స్పష్టత ఇవ్వాలని సీకర్ ను కోరారు.

మరళ ఏలాంటి స్పష్టత ఇవ్వకపోవడంతో అసంతృప్తికి గురైన ఎమ్మెల్యేలు సుప్రీం కోర్టులో వాదనకు దిగారు. దీనితో సుప్రిం కోర్టు ఎమ్మెల్యేతో వివరణ తీసుకోని సాయంత్రానికల్లా కోర్టులు తెలియజేయాలని స్పీకర్ రమేష్ కుమార్ ను ఆదేశించింది. దీంతో స్పీకర్ రమేష్ కుమారు అసమ్మతి ఎమ్మెల్యేలతో పాటు పార్టీ నేతలతో కూడా చర్చలు జరుపుతున్నారు.

రాజ్యాంగం ప్రకారంగానే తాను వ్యవహరిస్తాననని కర్ణాటక స్పీకర్ రమేష్ కుమార్ స్పష్టం చేశారు. కుమారస్వామి ప్రభుత్వాన్ని రక్షించాల్సిన అవసరం తనకు లేదన్నారు. శుక్రవారం నాడు  ఓ తెలుగు న్యూస్ ఛానెల్‌తో  ఆయన మాట్లాడారు. ఎమ్మెల్యేల రాజీనామాలపై ఎలాంటి ఒత్తిడి లేకుండా తాను నిర్ణయం తీసుకొంటానని ఆయన  స్పష్టం చేశారు. తాము ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గాల ప్రజలు ఏం కోరుకొంటున్నారో ఆ మేరకు తాను నిర్ణయం తీసుకొంటానని చెప్పారు.

కర్ణాటకకు చెందిన ఎమ్మెల్యేలు ముంబైలో ఎందుకు ఉన్నారని ఆయన ప్రశ్నించారు. తనను కలవకుండానే ఎమ్మెల్యేలు కలిసినట్టుగా సుప్రీంకోర్టుకు ఎందుకు తప్పుడు సమాచారం ఇచ్చారో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. రాజీనామాలు సమర్పించిన ఎమ్మెల్యే లేఖలకు సంబంధించి తాను కన్విన్స్ కావాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. తాను ఎమ్మెల్యేలను కలవకుండానే పారిపోయినట్టుగా తప్పుడు ప్రచారం చేశారని  స్పీకర్ రమేష్ కుమార్  రాజీనామా లేఖలు ఇచ్చిన ఎమ్మెల్యేలపై మండిపడ్డారు.

స్పీకర్ పదవిని చేపట్టిన తర్వాత తాను రాజ్యాంగం ప్రకారంగా నియమ నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాల్సి ఉంటుందన్నారు.కర్ణాటక అసెంబ్లీ చెబుతున్న నియమనిబంధనలకు తాను కట్టుబడి పనిచేస్తానని ఆయన ప్రకటించారు. మరోవైపు అసెంబ్లీలో సీఎం కుమార స్వామి బలనిరూపణకు దిగటంపై చివరకు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితిగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: