ఏపీ ముఖ్య‌మంత్రి వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి త‌న ప‌రిపాల‌న‌లోని మొద‌టి ప్ర‌జారంజ‌క బ‌డ్జెట్‌ను ప్ర‌వేశ‌పెట్టిన సంగ‌తి తెలిసిందే. త‌మ హ‌యాంలో మీడియా మేనేజ్‌మెంట్‌తోనే ప‌రిపాల‌న‌ను స‌రిపుచ్చిన‌ టీడీపీ అధ్య‌క్షుడు చంద్ర‌బాబు నాయుడు ఈ బ‌డ్జెట్‌పై విమ‌ర్శ‌లు చేశారు. దీంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తాజాగా ఊహించ‌ని కౌంట‌ర్ ఇచ్చింది. విజయవాడలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ర్ట కార్యాలయంలో తాజాగా రాష్ర్ట వ్యవసాయ మిషన్ వైస్ ఛైర్మన్ ఎంవిఎస్ నాగిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ బాబు తీరును ఎండ‌గ‌ట్టారు.


 బడ్జెట్లో వ్యవసానికి 12.66  శాతం కేటాయింపులు సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రకటించారని పేర్కొంటూ ఉచిత విద్యుత్ కు చేసిన ఖర్చుతో కలిపి బడ్జెట్ వ్యవసాయంకు 13.5 శాతం దాటుతుందని ఎంవీఎస్ రెడ్డి తెలిపారు. ` రైతుల కష్టాలు తెలిసిన వ్యక్తి ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి. అందుకే బడ్జెట్‌లో వ్యవసాయానికి ముఖ్యమంత్రి  వైయస్ జగన్మోహన్ రెడ్డి పెద్ద పీట వేశారు. రైతులు గిట్టుబాటు ధర కోసం ధరల స్థిరీకరణ నిధిగా 3 వేల కోట్లు కేటాయించారు. చంద్రబాబు రైతులకు పూర్తిస్థాయిలో రుణమాఫీ చేస్తామని చెప్పి మాట తప్పారు. చంద్రబాబులాగా ముఖ్యమంత్రి వైయస్ జగన్ మాట తప్పే వ్యక్తి కాదు. దేశంలో ఎక్కడ లేని విధంగా  పంటలకు బీమా ముఖ్యమంత్రి వైయస్ జగన్ కడతామని ప్రకటించారు. చంద్రబాబు అధికారంలో ఉండగా చనిపోయిన రైతులకు పరిహారం అడిగితే రైతులకు పరిహారం ఇస్తే  మరింత మంది పరిహారం కోసం చనిపోతారని చంద్రబాబు ఎగతాళిగా మాట్లాడారు. చంద్రబాబు హయాంలో ఆత్మహత్య చేసుకున్న రైతులకు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పరిహారం ఇవ్వడానికి సిద్ధమయ్యారు. వచ్చే ఏడాది నుంచి ఇవ్వాల్సిన రైతు భరోసాను సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ ఏడాది నుంచే ఇస్తున్నారు.`` అని నాగిరెడ్డి వెల్ల‌డించారు. 


వడ్డీ లేని రుణాలు రైతుకు లక్ష వరకు ఇవ్వాలని సీఎం నిర్ణయం తీసుకున్నారని నాగిరెడ్డి అన్నారు. ``రైతులకు దివంగత రాజశేఖర్ నేత మేలు చేసినట్లే సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా మేలు చేస్తున్నారు. రైతులకు ముఖ్యమంత్రి వైఎస్ జగనమోహన్ రెడ్డి ప్రభుత్వం అండగా ఉంటుంది. వ్యవసాయానికి పగటి పూట విద్యుత్ ఇవ్వడానికి పెద్ద ఎత్తున నిధులు కేటాయించారు. గ‌త ప్రభుత్వం విత్తన కంపెనీలకు నిధులు ఎగ్గొట్టింది..విత్తన సంక్షోభాన్ని తెచ్చింది. దివంగత నేత  రాజశేఖర్ రెడ్డి పాలనలో, సీఎం జగన్మోహన్ రెడ్డి 40 రోజుల పాలనలో రైతులకు జరిగిన అభివృద్ధి పై టీడీపీ నేతలతో చర్చకు మేము సిద్ధం..టీడీపీ నేత‌లు సిద్ధ‌మా?``అని స‌వాల్ విసిరారు.


మరింత సమాచారం తెలుసుకోండి: