ఇతర పార్టీల నుండి ఎవరు వచ్చినా బిజెపిలో చేర్చుకుంటామని మొన్నటి వరకూ చెప్పినా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తాజాగా  ఓ కీలక అంశాన్ని బయటపెట్టారు.   నేతల చేరికలపై బిజెపి ప్రధానంగా తెలుగుదేశంపార్టీ పైనే దృష్టి పెట్టిన విషయం అందరికీ తెలిసిందే. అయితే టిడిపి నేతల విషయంలో కన్నా కొత్త విషయం చెప్పారు.

 

టిడిపి నుండి ఎవరు వచ్చినా చేర్చుకుంటాము కానీ కొందరిని మాత్రం చేర్చుకునేది లేదట. ఇంతకీ ఎవరా కొందరు అంటే మాత్రం చెప్పటం లేదు. టిడిపి నేతల్లో ఆ ఎనిమిది మందికి  మాత్రం బిజెపిలో ఎంట్రీ లేదని స్పష్టంగా చెప్పేస్తున్నారు.

 

సదరు ఎనిమిది మంది నేతల వివరాలు చెప్పమంటే మాత్రం చెప్పటం లేదు. టిడిపిని బిజెపిలో విలీనం చేసుకోవాల్సిన అవసరం తమకు లేదన్నారు. చంద్రబాబునాయుడు టిడిపికే అవసరం లేనపుడు తమకు మాత్రం ఎలా పనికొస్తాడంటూ ఎదురు ప్రశ్నిస్తున్నారు.

 

టిడిపి నుండి రెండు, మూడు రోజుల్లో భారీ చేరికలుంటాయని తాజాగా చెప్పారు. మాజీ మంత్రులు, మాజీ ఎంఎల్ఏలు తమ పార్టీలో చేరేందుకు రెడీగా ఉన్నట్లు కన్నా చెప్పారు. తమ పార్టీలో చేరుతామంటూ టిడిపి ఎంఎల్ఏలెవరూ తనతో మాట్లాడలేదని మాత్రం చెప్పారు. అంతా బాగానే ఉంది కానీ బిజెపికి ఎంట్రీలేని ఆ ఎనిమిది ఎవరో కూడా చెప్పేస్తే బాగుంటుంది కదా ?

 

 

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: