ఇపుడందరిలోను ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. చంద్రబాబునాయుడు అశక్తతను నేతల్లో చాలామంది ఫుల్ గా అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు. ఇందులో భాగంగానే ఎంఎల్సీ బుద్ధా వెంకన్న-ఎంపి కేశినేని నాని వ్యవహారం శృతిమించి రోడ్డున పడింది. తాజాగా ఎంపి ట్వీట్ చూస్తుంటే ఏకంగా చంద్రబాబుకే అల్టిమేటమ్ ఇస్తున్నట్లే ఉంది.


మొన్నటి ఎన్నికల్లో టిడిపి ఘోరంగా ఓడిపోయిన విషయం తెలిసిందే. దాంతో ఏ నేత ఎపుడు పార్టీకి రాజీనామా చేస్తారో చంద్రబాబుకే అర్ధం కావటం లేదు. ఈ నేపధ్యంలోనే బుద్ధా, నాని మధ్య మొదలైన ట్విట్టర్ వార్ తీవ్రస్ధాయికి చేరుకుంది. ఆ వార్ లో బుద్ధా ధాటికి తట్టుకోలేకే నాని రాజీనామా అస్త్రాన్ని చంద్రబాబు మీదకు సంధించినట్లు అర్ధమవుతోంది.

 

ఆదివారం ఇద్దరు నేతల మధ్య ట్విట్టర్లో అనేక ట్వీట్లు నడిచాయి. తెరపైన వీరిద్దరే కనబడుతున్నా తెర వెనకాల మాత్రం ఇద్దరు నేతలకు మద్దతుగా జిల్లాలో నేతలు చీలిపోయిన విషయం అందరూ గమనిస్తున్నదే. ట్విట్టర్ వేదికగా ఇద్దరు ఒకరి బండారం మరొకరు బయట పెట్టుకున్నారు. దాంతో అందరూ దొంగలేనా అనే అనుమానం జనాలకు వస్తే అది వాళ్ళ తప్పు కానేకాదు.

 

చివరగా బుద్ధా సంధించిన అస్త్రానికి సమాధానం చెప్పలేకపోయినట్లున్నారు ఎంపి. అందుకనే సోమవారం ఉదయం ట్విట్టర్లో చంద్రబాబును ఉద్దేశించి రాజీనామా అస్త్రాన్ని ప్రయోగించారు. తన లాంటి వాళ్ళు అవసరం లేదని చంద్రబాబు అనుకుంటే ఎంపితో పాటు పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తానని నాని బెదిరించినట్లే కనబడుతోంది. మరి ఈ పరిస్ధితుల్లో చంద్రబాబు ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: