చూడబోతే పరిస్దితిలు అలాగే ఉంటుందేమో అనిపిస్తోంది. రాష్ట్ర విభజన కారణంగా టిడిపిపై ముందుగా తెలంగాణాలో దెబ్బ పడింది. దానికితోడు మొన్నటి తెలంగాణా ముందస్తు ఎన్నికల్లో కాంగ్రెస్ తో పొత్తుపెట్టుకోవటంతో ఉన్న అరకొర నేతలు కూడా టిడిపిని వదిలేశారు. దాంతో పార్టీ తెలంగాణాలో సాంతం నేలమట్టమైపోయింది. అందుకే చంద్రబాబునాయుడు కూడా తెలంగాణాలో టిడిపిని వదిలేశారు.

 

మొన్నటి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి దెబ్బకు టిడిపి దాదాపు తుడిచిపెట్టుకుపోయినట్లైంది. 175 అసెంబ్లీ సీట్లలో 23 చోట్ల గెలిచి ఏదో అసెంబ్లీలో టిడిపి ఉందనిపించుకుంటోంది. చంద్రబాబు నాయకత్వం మీద నమ్మకం లేకే చాలామంది నేతలు బిజెపిలోకి వెళిపోతున్నారు. అంటే వైసిపి గేట్లు తెరుచుకోని కారణంగా నేతలందరూ బిజెపి లోకే వెళుతున్నారు.

 

ఇపుడున్న 23 మంది ఎంఎల్ఏల్లో కూడా ఎంతమంది బిజెపిలోకి ఫిరాయిస్తారో తెలీక చంద్రబాబులో టెన్షన్ పెరిగిపోతోంది.  ఈ నేపధ్యంలోనే బిజెపి ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ మాట్లాడుతూ టిడిపి భవిష్యత్తులో అమెరికాలోని తానా సభల్లో మాత్రమే మిగిలిపోతుందన్నారు. తొందరలోనే టిడిపి భూస్ధాపితమైపోవటం ఖాయమని జోస్యం కూడా చెప్పారు.

 

రామ్ మాధవ్ ఏ అర్ధంలో చెప్పినా  అందులో వాస్తవం కూడా ఉందనే అనిపిస్తోంది. చాలామంది నేతలు టిడిపిలో నుండి ఎప్పుడెప్పుడు బయటకు వచ్చేద్దామా అని ఎదురు చూస్తున్నారు. టిడిపి నేతలను చేర్చుకోవటానికి జగన్ ఇంకా రెడీ కాలేదు. నిజంగానే జగన్ గనుక గేట్లు తెరిస్తే టిడిపిలో ఎంతమంది ఎంఎల్ఏలు, నేతలుంటారో ఎవరూ చెప్పలేరు. జగన్ గేట్లు తెరిస్తే అప్పుడు రామ్ మాధవ్ చెప్పిన విషయం నిజమవుతుందేమో ?

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: