ఏపీఐఐసీ ఛైర్మెన్ గా నగరి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఆర్కే రోజా సోమవారం బాధ్యతలు స్వీకరించారు.ఈ సందర్బంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఆమె కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ పదవిలో రోజా రెండేళ్ల పాటు కొనసాగిస్తారు. బాధ్యతలు స్వీకరించిన ఆమెకు పలువురు అభినందననలు తెలియజేశారు.
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మహిళా పక్షపాతి బడ్జెట్ చూసినా,నవరత్నాలు చూసిన ఆ విషయం అర్థమవుతుంది. పారిశ్రామిక అభివృద్ధి చేయడానికి నా వంతు కృషి చేస్తాం.కేంద్రం ప్రత్యేక హోదా ఇచ్చినట్లయితే రాష్ట్రం మరింత అభివృద్ధి చెందేది. పెట్టుబడులు పెట్టేవారందరికీ అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తాం.
పారిశ్రామికీకరణకు బడ్జెట్ లో ముఖ్యమంత్రి పెద్దపీట వేశారు. అన్ని జిల్లాలలో పారిశ్రామిక రంగాలను అభివృద్ది చెయ్యడానికి కృషి చేస్తాం.స్థానిక పరిశ్రమలలో యువతకు 75శాతం చోటు కల్పిస్తామని సీఎం ఇప్పటికే ప్రకటించారు.పారదర్శకంగా ఏపీఐఐసీ ద్వారా భూములు కేటాయింపు జరుగుతుందని రోజా తెలియజేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: