విద్యుత్ కొనుగోళ్ళల్లో భారీ ఎత్తున అక్రమాలు చోటు చేసుకున్నాయా ? జగన్మోహన్ రెడ్డి సలహాదారు, మాజీ చీఫ్ సెక్రటరీ అజేయ కల్లం తాజాగా చెప్పిన దాన్ని బట్టి అలాగే అనుకోవాలి. విద్యుత్ సరఫరా కోసం చంద్రబాబునాయుడు హయాంలో విద్యుత్ ఉత్పత్తి సంస్ధలతో చేసుకున్న  పిపిఏ ఒప్పందాల్లో భారీ అవకతవకలు జరిగినట్లు అర్ధమవుతోంది.

 

133 సంస్ధలతో పిపిఏ చేసుకుంటే అందులో 70 శాతం పిపిఏలు  5 సంస్ధలతోనే జరిగాయన్నారు. అంటే ఇందులోనే అవినీతి జరిగిందని అర్ధమొచ్చేట్లుగా చెప్పారు. పైగా  యూనిట్ ధర 2.4 రూపాయలకే దొరుకుతుంటే చంద్రబాబు మాత్రం యూనిట్ ను 6 రూపాయలకు కొంటామని అగ్రిమెంట్ చేసుకున్నారట.

 

మొత్తం మీద విద్యుత్ పిపిఏల్లో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని కల్లం చెప్పకనే చెప్పారు. ఆ పిపిఏలన్నింటినీ సమీక్షిస్తున్నట్లు చెప్పారు. అసలు పిపిఏలు లేకుండానే తాము కావాల్సినంత విద్యుత్ ను అందిస్తామని చాలా కంపెనీలు చెబుతున్నాయట. బయట నుండి విద్యుత్ కొనుగోలు చేయాల్సిన అవసరం కూడా ప్రస్తుతం లేదన్నారు.

 

మొత్తం పిపిఏలను సమీక్షిస్తున్నట్లు కల్లం చెప్పారు.  అగ్రిమెంట్లన్నింటినీ సమీక్షించిన తర్వాత తమ నివేదికను జగన్ కు అందిస్తామన్నారు. ప్రజాధనం వృధా కాకూడదన్నదే జగన్ ఉద్దేశ్యంగా కల్లం చెబుతున్నారు. చూడబోతుంటే పిపిఏల్లో చంద్రబాబును ఫిక్స్ చేసేట్లే ఉంది జగన్ ప్రభుత్వం.

 


మరింత సమాచారం తెలుసుకోండి: