ఆంధ్ర ప్రదేశ్ కు కియా పరిశ్రమ ఎవరి వల్ల వచ్చిందన్న దానిపై అధికార వైకాపా , ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ సభ్యుల మధ్య అసెంబ్లీ వాదోపవాదాలు జరిగాయి . ఏపీ కి కియా పరిశ్రమ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి చొరవ వల్లనే వచ్చిందని ఆర్ధికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు . బుగ్గన వ్యాఖ్యలను  ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు తీవ్రంగా ఆక్షేపించారు .


రాజేంద్రనాథ్ రెడ్డి గారు మీరు చాల తెలివైనవాళ్లు హ్యాట్సాఫ్ ... మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను . 2009లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి చనిపోయారని , కియా పరిశ్రమ సీఈఓ దగ్గరికి ఆయన ఆత్మ వెళ్లిందా ? అంటూ ప్రశ్నించారు . 2016లో చంద్రబాబు నాయుడు దగ్గరకు వెళ్ళండి .. ఆయన అన్ని సౌకర్యాలు కల్పిస్తారా ? అంటూ చెప్పిందా అని ఎద్దేవా చేశారు . ఇలాంటి  అసత్యాలను కూడా సత్యాలు చెప్పే మనస్తత్వం మీకుంది సైటర్లు వేశారు .


అనంతపురం లో కియా పరిశ్రమను స్థాపించిన విషయం తెల్సిందే . కియా పరిశ్రమ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాం లో ఏర్పాటు చేసిన విషయం తెల్సిందే . అయితే గతం లో దివంగత ముఖ్యమంత్రి చొరవ వల్లనే  రాష్ట్రం లో కియా పరిశ్రమ ఏర్పాటు చేయడం జరిగిందని వైకాపా సభ్యులు పేర్కొంటున్నారు . రాజశేఖర్ రెడ్డి చొరవ చూపించి ఉండకపోతే రాష్ట్రానికి కియా పరిశ్రమ వచ్చి ఉండేది కాదని అంటున్నారు .


మరింత సమాచారం తెలుసుకోండి: