వారంతా నిరుపేదలు.. కాయకష్టం చేసుకొని జీవనం సాగిస్తున్నారు. కూలి పనికి వెళ్తేనే గాని పూట గడవని పరిస్థితి.  వచ్చిన కాస్తో కూస్తో కూలి డబ్బులను ఇళ్లలోనే దాచుకుని అవసరానికి వినియోగించుకునే అల్పజీవులే వీరంతా. జరిగిన అగ్నిప్రమాదంలో వీరంతా కట్టుబట్టలతో రోడ్డున పడ్డారు. పొగిరి గ్రామంలో ఈ ప్రమాదం జరిగింది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో అందరు భయబ్రాంతులయ్యారు. 

దగ్గరలోని విద్యుత్ తీగలు షార్ట్ సర్క్యూట్ అవ్వడంతో ఈ ప్రమాదం జరిగిందని అక్కడి స్థానికుల అంచనా. ఆ సమయంలో  కాలనీలో నివాసముంటున్నవారంతా ఉపాధి పనులకు వెళ్లిపోడంతో ప్రమాదాన్ని ఎవరు గుర్తించలేకపోయామని వాపోయారు. 
అగ్నికి వాయువు తోడుకావడంతో మంటలు ఒక ఇంటి ముంచి మరో ఇంటికి వ్యాపించాయి. గ్రామంలో అగ్ని చెలరేగుతుందని తెలుసుకుని తమ ఇళ్లకు చేరుకునే సమయానికే మొత్తం నష్టం జరిగిపోయిందని ఆవేధన వ్యక్తం చేశారు. 

అప్పటికే  పూరిళ్లలో ఉన్న వంట గ్యాస్ బండలకు అగ్ని అంటుకొని అవి పేలడంతో మంటల వ్యాప్తి అధికమైంది. మంటలను అదుపు చేయడానికి వెళ్లిన గ్రామస్తులు, యువకులు గ్యాస్ బండల పేలుళ్లకు  భయబ్రాంతులయ్యారు. అగ్ని ఒక ఇంటి నుంచి మరో ఇంటికి వ్యాపించి మొత్తం రెండు వీధిలో మంటలు చెలరేగాయి. ఈ మంటల వ్యాప్తికి మొత్తం 31 పూరెగుడిసెలు అగ్నికి ఆహుతయ్యాయి.

ఈ ప్రమాదంలో  భారిగా నగదు, 11 ఇళ్లలో బీరువాలు మొత్తం అగ్నికి ఆహుతయ్యాయి. నాలుగు ఇళ్ల నుంచి గ్యాస్ బండలు పెద్దశబ్దం చేస్తూ పేలాయి. పెన్నెండు కుటుంబాలకు చెందిన టీవీలు పూర్తిగా నాశనం అయ్యాయి. జరిగిన  ప్రమాదంతో అక్కడి ప్రాంతమంతా  ఒక యుద్దభూమిలా దర్శనమిచ్చింది.


మరింత సమాచారం తెలుసుకోండి: