ఖరీఫ్ ఆరంభంలోనే రైతులకు విషమ పరీక్షలు ఎదురవుతున్నాయి. కారుమబ్బులు ఊరించి  ఊరించి  ఉసూరుమనిపిస్తూ అన్నదాతలను వెక్కిరిస్తున్నాయి. ఈ ఏడాది ఖరీఫ్ గత ఏడాది కంటే కాస్త ఆలశ్యంగానే ఆరంభమైంది.  నైరుతి రుతుపవనాలు కూడా ముఖం చాటేయడంతో ఆలస్యం తప్పలేదు. సీజన్ వచ్చి 46 రోజులు గడిచాయి. కానీ ఈ సమయానికి  పడాల్సినంత వర్షపాతం ఇంకా నమోదు కాలేదు. వరుణుడు ఇంకా దాగుడుమూతలు ఆడుతూనే ఉన్నాడు. ఇటీవల రెండు సార్లు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినా, వాటి వల్ల కూడా అంతాగా వర్షాలు కురవలేదు. 

ఈ ఏడాది జూన్ మొదటి నుంచి ఇప్పటి వరకూ ఎక్కడా భారి వర్షాలు పడిన జాడ లేదు. దీంతో ఖరీఫ్ సీజన్ పై రైతుల్లో ఆందోళన చోటు చేసుకుంటోంది. రోజురోజుకి వారిలో దిగులు పెరుగుతోంది. జిల్లాతో పాటు వంశధార , నాగావళి నదులకు నీటిని  అందించే ఒడిశా క్యాచ్మెంట్ ఏరియాలో కూడా వానలు కురవలేదు. దీంతో ఆ నదుల ఆనకట్టల వద్ద తగినంతగా నీరు నిల్వ లేకపోవడంతో పొలాలు ఎండిపోతున్నాయి.  ప్రతి రోజు మబ్బులు వేస్తున్నా , వర్షాలు మాత్రం కురవడం లేదు. ఉరుములు, పిడుగులకే పరిమితం అవుతున్నాయి. జిల్లాలో ఖరీఫ్ సీజన్ లో వరి ప్రధాన పంట . ఈ సీజన్ లో 2.13 లక్షల హెక్టర్లలో వరి పండిస్తారు. 

ఇప్పటికే పంటలు కూడా వేశారు. జిల్లాలో రెండు విధాలుగా సాగు జరుగుతుంది. నేరుగా విత్తనాలు పొలాల్లో జల్లి వెడలు వేస్తారు. మరో విధానంలో   నారుమడుల్లో విత్తనాలు పోసి, తర్వాత వాటిని పొలాల్లో నాటుతారు. కోనేళ్ళుగా రైతులు వెద పద్దితికే ప్రాధాన్యమిస్తున్నారు. వర్షాభావం, కూలీల కొరత, మదుపులు పెరగడంతో ఈ పద్ధతినే  అనుసరిస్తున్నారు. ఈ ఏడాది జిల్లాలో రైతులు 82,000  హెక్టర్లలో వరి పంటలను వెదల పద్దతిలో జల్లారు. మిగిలిన 1,31,000 ఛేక్టర్లలో నారుమడులు సిద్ధం చేసారు. అయితే ఇటీవల వర్షాలు తగినంతగా పడకపోవడంతో చాలా చోట్ల పొలాల్లో వెదలు, నారుమడులు ఎండిపోయాయి. మరో రెండు వరాలు ఇదే పరిస్థితి ఉంటే అన్నదాతలకు కన్నీరు తప్పేలాలేదు.



మరింత సమాచారం తెలుసుకోండి: