యాత్ర .. పాదయాత్ర రాజన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్రంలో ప్రజల కష్టాలను తెలుసుకోవడానికి మొదలు పెట్టిన యాత్ర పాదయాత్ర. అనుకున్నట్టుగానే ఆ పాదయాత్రలో ఆంధ్ర ప్రదేశ్ ప్రతి గడపలోని ప్రజల కష్టాలు తెలుసుకొని ప్రజలకు ఎంతో మేలు చేశారు రాజన్న. రైతులకు ఎంతో మంచి చేసి రైతు రాజు అని పేరు తెచ్చుకున్నారు మన రాజన్న. 


ఇది మాత్రమే కాదు ఆంధ్ర రాష్ట్రంలో అప్పట్లో పదేళ్ల పాటు అధికారంలో లేని కాంగ్రెస్ పార్టీని ఏకపక్షంగా గెలిపించిన రాజు వైఎస్ రాజశేఖర్ రెడ్డి. దీంతో రాజన్న తర్వాత వచ్చిన ప్రతి నాయకుడు పాదయాత్రలు చేసే వారే. 2013లో చంద్రబాబు నాయుడు పాదయాత్ర చేశారు 2014లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. 5 ఏళ్ళు ఆంధ్ర రాష్ట్రంలో రాజ్యం ఏలింది. 


2017లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రను ప్రారంభించారు. ప్రజల కష్టాలను తెలుసుకున్నారు, ప్రజలకు దగ్గరయ్యారు. 2019లో వైసీపీ అత్యధిక మెజారిటీతో 151 సీట్లతో గెలిచింది. దీంతో చంద్రబాబు తనయుడు నారా లోకేష్ పాదయాత్రకు సిద్దమయ్యారట. ఇప్పటి నుండి పాదయాత్ర చేసి 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని దారుణంగా ఓడించడమే లక్ష్యంగా పెట్టుకున్నారని టీడీపీ వర్గాల్లో ప్రచారం జరుగుతుందని మీడియాలో, సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. 


ఒకవేళ ఈ వార్తలు నిజమైతే వైఎస్ రాజశేఖర్ రెడ్డిని చంద్రబాబు నాయుడు ఫాలో అయ్యి 2014లో గెలిచినట్టు, వైఎస్ జగన్ ని నారా లోకేష్ ఫాలో అయ్యి 2024లో నారా లోకేష్ గెలుస్తారా అనేది చూడాలి. ఏది ఏమైనప్పటికి నారా కుటుంబం వైఎస్ కుటుంబన్ని ఫాలో అవుతోందని, నారాలోకేష్ పాదయాత్రతో అర్థమైపోతుందని కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు. కాగా నారా లోకేష్ నిజంగా పాదయాత్ర చేస్తారా అనేది చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: