జ‌గ‌న్ దూకుడుకు క‌ళ్లెం వేయాల‌ని బీజేపీ ఎప్పటినుండో  చూస్తోందా.. జగన్ స్పీడుకు బ్రేక్  వేయ‌డానికి ఇప్పటికే అన్ని సిద్ధం చేసుకుందా.. అన్న ప్రశ్నలకు  అవుననే అనిపిస్తోంది. సెంట్ర‌ల్ ప‌వ‌ర్ మినిస్ట‌ర్ ఆర్‌కె సింగ్ కూడా ఈ విషయం గురించే కొన్ని రోజులు క్రితం చెప్పాడు.  అయితే ముఖ్యంగా బీజేపీ ఒక విషయంలో మాత్రం జగన్ ను తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.   బాబుగోరి  ప్ర‌భుత్వం ప‌వ‌ర్ ప్రాజెక్ట్‌ల విష‌యంలో పీపీఏల ఒప్పందాల్ని ర‌ద్దు చేయాల‌ని  జ‌గ‌న్ నిర్ణ‌యించుకున్నారు. ఇదే ఇప్పుడు కేంద్రానికి మింగుడు ప‌డ‌టం లేదు. అలా చేస్తే రాష్ట్రానికి వ‌చ్చే పెట్టుబ‌డులు రావ‌ని కేంద్ర మంత్రి ఏపీ స‌ర్కారును హెచ్చ‌రించ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. విద్యుత్ కొనుగోళ్ల విష‌యంలో అవ‌క‌త‌వ‌క‌లు జ‌రిగాయ‌ని జగన్  గుర్తించారు. 


బాబుగోరి ప్ర‌భుత్వం చేసుకున్న ఒప్పందాల్ని ర‌ద్దు చేస్తానంటూ ప్ర‌క‌టించ‌డంతో కేంద్ర‌మంత్రి రంగంలోకి దిగి..   పీపీఏల ఒప్పందాల పై ఆలోచన మార్చుకోవాలని జగన్ కి చెప్పుకొచ్చారు. అప్పుడు ఊ కొట్టిన జగన్ మళ్లీ అదే ఆలోచన చేస్తోన్నట్లు తెలుస్తోంది. అయితే బీజేపీ జోక్యంతో  పీపీఏల ఒప్పందంపై మ‌రిన్ని అనుమానాలు త‌లెత్తుతున్నాయి. మొత్తానికి అప్పట్లో బాబు చేసుకున్న  ఒప్పందం వెనుక బీజేపీ పెద్ద‌ల హ‌స్తం వుంద‌ని అనుమానం కూడా వస్తోంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: