ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ సమావేశాలు చాలా వేడిగా సాగుతున్నాయి, గత ప్రభుత్వం తాలూకు తప్పుల్ని అధికారపక్షం వేలెత్తి చూపడం, అధికారపక్షం నిర్ణయాలను ప్రతిపక్షం వ్యతిరేకించడం  ఇలా రోజుకో హైడ్రామా నడుస్తుంది. ప్రభుత్వ యంత్రాంగం పనితీరును మెరుగుపరచడం కోసం సీఎం జగన్మోహన్ రెడ్డి కృషి చేస్తున్నారు.
 
వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో అనూహ్యమైన మార్పులు జరుగుతున్నాయి. అధికారుల బదిలీలు, అక్రమకట్టడాల కూల్చివేతలు వేగంగా జరిగాయి. అయితే కృష్ణ నది కరకట్ట మీద ఉన్న అక్రమ కట్టడాలు ఇంకా కూల్చివేస్తూనే ఉన్నారు అధికారులు.ప్రజావేదిక తర్వాత కూల్చివేత తర్వాత అది ఇంకా ఎక్కువగా సాగుతుంది. కరకట్ట అక్రమ కట్టడాలలో చంద్రబాబు నివాసం కూడా ఉంది.
 
ఆనకట్ట మీద ఉన్న చంద్రబాబు నివాసానికి కూల్చేస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ శాసనమండలిలో ప్రకటించారు. కృష్ణానది కరకట్ట పక్కన నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన భవనాలను ఇప్పటి కే సిఆర్టిఏ నోటీసులు జారీ చేసిందన్నారు. చంద్రబాబు తమ నివాసాన్ని వెంటనే కాలి చేయాలన్నారు, లేదంటే చట్టబద్ధంగా ముందుకు వెళ్తామని ఆయన పేర్కొన్నారు. మిగతా కట్టడాలతో కలిపి చంద్రబాబు నివాసానికి కూల్చివేయడం తప్పదని ఆయన అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: