ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్న యాప్ లలో 'టిక్ టాక్' చురుగ్గా ప్రజల్లోకి దూసుకుపోతుంది. పిల్లల నుంచి పెద్దవారి వరకు ఈ యాప్ మోజులో పడిపోతున్నారు. ఇటీవల ఖమ్మం కార్పొరేషన్ కార్యాలయంలో సిబ్బంది పని వేళలో టిక్ టాక్ వీడియోలు చేయడం వివాదాస్పదమైన సంగతి అందరికి తెలిసిందే. ఈ యాప్ ప్రతి ఒక్కరిపై చెడు ప్రభావం చూపుతోందని, దీనిని నిషేదించాలంటూ ఎప్పట్నుంచో డిమాండ్స్ వినిపిస్తున్నాయి.


అయితే ఇటీవలే 'టిక్ టాక్' తో పాటు 'హాలో' యాప్ కూడా కేంద్ర ప్రభుత్వానికి షాకిచ్చింది. ఆయా యాప్ లు జాతి వ్యతిరేక కార్యకలాపాలకు కేంద్రంగా మారాయని వచ్చిన ఆరోపణలపై సదరు సంస్థలకు 21 ప్రశ్నలతో కూడిన నోటీస్ లను కేంద్రం జారీ చేసింది. పద్దెనిమిదేళ్ల లోపు పిల్లలందర్నీ వీటి నుంచి నిషేధించాలని ఆదేశించింది.


సరైన వివరణ రాకపోతే ఈ రెండు యాప్ లను దేశంలో నిషేధిస్తామని హెచ్చరిస్తూ కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ ఈ నోటీసులను జారీ చేశాయి. ఈ రెండు యాప్ లు పై వచ్చిన ఆరోపణలను  ఐటీ శాఖ ఆయా యాప్ ల సంస్థల నుంచి వివరణ కోరింది.  


మరింత సమాచారం తెలుసుకోండి: