ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహ రెడ్డి తీసుకుంటున్న సంచలన నిర్ణయాలలో ఎలక్ట్రిక్‌ బస్సుల ఏర్పాటు మరో ప్రభంజనం కానుంది. కాలుష్య రహిత రాష్ట్రంగా మార్చాలనే సంకల్పంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. ఇందులో భాగంగా ఏ.పి.ఎస్.ఆర్.టి.సి లో ప్రస్తుతం వున్న డీజిల్ బస్సుల స్థానంలో పర్యావరణ పరిరక్షణలో భాగంగా కాలుష్య రహిత ఎలిక్ట్రిక్ బస్సులు ప్రవేశ పెట్టుటకు కసరత్తు జరుగుతోంది. 


ఈ ఆర్ధిక సంవత్సరం 2019-20 నందు సుమారు  వెయ్యి ఎలిక్ట్రిక్ బస్సులు ప్రవేశ పెట్టుటకు జాతీయ రహదారుల మంత్రిత్య శాఖకు ప్రతి పాదనలు సమర్పించారు. ఈ సందర్భంగా ప్రముఖ విద్యుత్  బస్సుల తయారీ దారులు మరియు సంబంధిత సాంకేతిక సంస్థల ప్రతినిధులను ఆహ్వానించి  సదస్సు నిర్వహించారు. ఈ సమావేశంలో అషోక్ లేలాండ్, టాటా  మోటర్స్ , ఐషర్ మోటర్స్ , ఓలెక్ట్రా గ్రీన్ టెక్  మోటర్స్ ,యాక్సిస్ మొబిలిటీ, ఫోటాన్ , ఎడిసన్ ఎలక్ట్రా , మరియు ఎ.ఎం.ఎస్. మొబిలిటీ తదితర  సంస్థల వారు మరియు ఎలక్ట్రిక్ చార్జింగ్‌ సప్లై సంస్థల వారు వారి  సంస్థల నైపుణ్యత  ఎలక్ట్రిక్ బస్సులు సరఫరా చేయుటకు వారి సంసిద్ధతను, వారి వద్ద గల వివిధ  రకాల బస్సుల గురించి , వాటి సామర్ధ్యము  మరియు వారి యొక్క తయారీ సామర్ధ్యము గురించి తెలియజేశారు. 


ఈ సమావేశంలో ఎ.పి.ఎస్.ఆర్.టి.సి. ఎక్స్పర్ట్  కమిటీ చైర్మన్ ఆంజనేయ రెడ్డి మరియు కమిటీ సభ్యులు సుదర్శనం పాదం, డాక్టర్ వి.భక్తవత్సలం, డాక్టర్ సి.రామచంద్రయ్య, ఎ.పి.ఎస్.ఆర్.టి.సి విసి అండ్  ఎం.డి ఎం.వి.సురేంద్రబాబు, ఐ.పి.ఎస్, రవాణా శాఖ ప్రిన్సిపాల్  సెక్రటరీ ఎం.టి. కృష్ణ బాబు, ప్రభుత్వ ఆర్ధిక శాఖ కార్యదర్శి కె.వి.వి. సత్యనారాణయ, NREDCAP  విసి అండ్ ఎం.డి. ఎస్. రమణారెడ్డి తదితరులు ప్రభుత్వం తరపున పాల్గొన్నారు. C.I.R.T, పూనా సంస్థ తరపున  రీసెర్చ్  అండ్ ట్రైనింగ్ హెడ్ ఎం .వి.దేవ్, ఎస్.ఎస్.డొలే,  జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ కేంద్ర ప్రభుత్వం తరుపున జాయింట్ డైరెక్టర్ జి.జయరావు హాజరయ్యారు.


మరింత సమాచారం తెలుసుకోండి: