టీడీపీ ఎమ్మెల్సీలు బీజేపీ తో టచ్ లో ఉన్నారని ఆ పార్టీ ఎమ్మెల్సీ మాధవ్ తెలిపారు . అయితే తమ పదవి కి రాజీనామా చేసి , బీజేపీ లో చేరే  విషయమే వారికి  అడ్డంకి గా మారిందన్నారు . పార్టీ ఫిరాయింపులకు పాల్పడే ప్రజాప్రతినిధుల ను   వెంటనే అనర్హుడి గా ప్రకటించాలన్న ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి  ప్రకటన కారణం గానే , టీడీపీ ఎమ్మెల్సీ లు బీజేపీ లో  చేరడానికి  సంశయిస్తున్నారని చెప్పారు .


ఆగస్టు  నెల తరువాత రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు ఉంటాయన్న మాధవ్ ,  ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కూడా బీజేపీ తో టచ్ లో ఉన్నారని చెప్పారు . ఇక ఎన్నికలకు ముందు బొత్స, ధర్మాన కూడా తమతో  టచ్ లో ఉన్నారన్నారు .ఆంధ్ర ప్రదేశ్ లో బలపడాలని చూస్తున్న బీజేపీ నాయకత్వం మైండ్ గేమ్ ఆడుతున్నట్లు తెలుస్తోంది . తమ పార్టీ నాయకత్వం తో ఒక్క టీడీపీ నాయకులే కాకుండా అన్ని పార్టీల నేతలు టచ్ లో ఉన్నారన్న సంకేతాలను ప్రజల్లోకి పంపే ప్రయత్నాన్ని ఆ పార్టీ నేతలు చేస్తున్నారు . ఎన్నికలు ముగిసిన నాటి నుంచి మొదలుకుని, ఇప్పటి వరకూ టీడీపీ ఎమ్మెల్యేలు తమ పార్టీలో చేరేందుకు రెడీ ఉన్నారంటూ బీజేపీ నేతలు చెప్పుకొస్తున్నారు .


అయితే బీజేపీ లో చేరుతున్న టీడీపీ నాయకుల జాబితాను పరిశీలిస్తే వ్యాపారస్తులు , కాంట్రాక్టులు నిర్వహించే వారే కమలం గూటికి చేరేందుకు ఆరాటపడుతున్నారు . వైకాపా లో చేరడానికి అవకాశం లేని వారు తమకు భవిష్యత్తు లో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా బీజేపీ లో చేరి రక్షణ పొందాలని భావిస్తున్నట్లు స్పష్టం అవుతోంది .

 


మరింత సమాచారం తెలుసుకోండి: