మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు రాజకీయం ఎటు అన్నది ఇపుడు ఏపీలో పెద్ద చర్చగా ఉంది. గంటా వంటీ సీనియర్ నాయకుడు. గ్లామర్, గ్రామర్ కలబోసిన నేత ఇపుడు కంప్లీట్ సైలెంట్ మోడ్ లో ఉన్నారు. అది ఇపుడు ప్రతిపక్ష టీడీపీని కలవరపరుస్తోంది. గంటా రూట్ ఎటూ అన్నది క్లియర్ గా తేలకపోవడంతో సైకిల్ పార్టీలో కంగారు ఎక్కువైంది.


అసెంబ్లీలో పల్లెత్తి ఒక్క మాట కూడా వైసీపీని విమర్శించని నేతగా గంటా ఉన్నారు. బాబుని ఓ వైపు వైసీపీ ఆడేసుకుంటున్నా కూడా గంటా మౌన ముద్ర వీడడంలేదు. ఆయన టీడీపీకి ఇప్పటికే చాలా దూరం జరిగారని అంటున్నారు. జగన్ వైపు ఆయన చూస్తున్నట్లుగా కూడా వార్తలు వస్తున్నాయి. జగన్ కనుక సరేనంటే ఎమ్మెల్యే సీటుకు కూడా రాజీనామా చేసి ఆయన వైసీపీ కండువా కప్పుకునేందుకు రెడీ అంటున్నారట.


మరి జగన్ కూడా గంటా వంటి బలమైన నాయకుడు విశాఖ సిటీకి అవసరమని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ బడ్జెట్ సమావేశాలు పూర్తి అయ్యాక జగన్ కీలక నిర్ణయం తీసుకుంటే గంటా టీడీపీకి, ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేయడం ఖాయమట. ఆయన‌తో పాటు మరో ఇద్దరు అనుచరులు కూడా రాజీనామా చేస్తారని అంటున్నారు. మొత్తానికి ముగ్గురి టీడీపీ ఎమ్మెల్యేలను  వైసీపీలో చేర్చుకోవడానికి జగన్ రెడీ అయ్యారన్న ప్రచారం జరుగుతోంది. . అదే జరిగితే ఏపీలో ఉప ఎన్నికల నగారా మోగినట్లే మరి.


మరింత సమాచారం తెలుసుకోండి: