తెలంగాణ బోనాలలో ప్రతియేటా సికింద్రాబాద్ లోని ఉజ్జయిని మహంకాళి ఆలయంలో స్వర్ణలత భవిష్యవాణి వినిపిస్తారు. ఆనవాయితీ ప్రకారం సికింద్రాబాద్‌ ఆలయంలో ‘రంగం’ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా స్వర్ణలత భవిష్యవాణి వినిపిస్తూ.. ఈ మేరకు సోమవారం  తెలంగాణ రాష్ట్ర ప్రజల కోరికలన్నీ తప్పనిసరిగా నెరవేరుతాయని, ప్రజలందరినీ కొరికలుతీర్చి సంతోషంగా ఉంచుతానన్నారు.  రాష్ట్రంలో తప్పకుండా మంచి వర్షాలు కురుస్తాయని.. భవిష్యవాణిలో చెప్పారు. గంగాదేవికి ఘనంగా జలాలతో అభిషేకించి బోనం తీయాలన్నారు. జాతర ఏర్పాట్లు బాగున్నాయని…తాను సంతృప్తి చెందానన్నారు.

సీఎం కేసీఆర్, మంత్రులు తనకెంతగానో సేవ చేశారని తెలిపారు. వారికి ఎలాంటి అనారోగ్యం రానివ్వను.. సుఖశాంతులతో ఉంటారని స్వర్ణలత భవిష్యవాణిలో స్పష్టం చేశారు. ప్రజలంతా సంతోషంగా బోనాలు సమర్పించుకున్నారని తెలిపారు. ప్రతీ ఏడు తప్పకుండా బోనాలు తీయాలని…తాను కూడా ప్రజలను చల్లంగా చూస్తానంది. 5 వారాల పాటు సాకలు, పప్పుబెల్లం తో తనను పూజించాలని… మీ కోరికలన్నీ తీరుతాయని స్వర్ణలత చెప్పారు. ఈ సంవత్సరం పూజలు ఎంతో సంతృప్తికరంగా జరిగాయని, గత సంవత్సరం తాను కొంత బాధపడ్డానని, ఈ ఏడాది సిబ్బంది మంచిగా పనిచేశారని పేర్కొంది.

‘‘నా బిడ్డలను సంతోషంగా ఉంచే బాధ్యత నాదే. నాకు పూజలెందుకు ఆపుతున్నారు. తన అక్కచెల్లెళ్లు దూరంగా వెళ్లకుండా, తనకు దగ్గరగానే ఉండి పూజలు జరిపించాలని సూచించింది. భవిష్యత్తులో ప్రజలకు ఎటువంటి ఆపదలూ రాకుండా చూసుకుంటానని స్వర్ణలత చెప్పారు. రైతులకు మంచి పంటలు పండుతాయని, ప్రజల సంతోషమే తన సంతోషమని వెల్లడించింది. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన పూజారి అడిగిన పలు ప్రశ్నలకు అమ్మ తరఫున స్వర్ణలత సమాధానాలిచ్చింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: