రాహుల్ గాంధీ రాజీనామాతో ఖాళీ అయిన కాంగ్రెస్ ప్రెసిడెంట్ పదవి ఎవరితో భర్తీ చేస్తారా అన్న అంశంపై చర్చ కొనసాగుతూనే ఉంది. పలువురు సీనియర్ లు ఆ పదవిపై ఆశ పెట్టుకోగా ఈ మధ్య కాలంలో ప్రియాంకా గాంధీ పేరు తెరపైకి వచ్చింది.  కొందరు పార్టీ నేతలు ఆమె పార్టీ పగ్గాలు చేపట్టాలని కోరారు అయితే కాంగ్రెస్ బాధ్యతలు చేపట్టే ప్రసక్తే లేదని ప్రియాంకా గాంధీ వారికి తేల్చిచెప్పినట్టు సమాచారం.

ప్రధాన కార్యదర్శి హోదాలోనే పార్టీకి సేవ చేస్తానని ఆమె స్పష్టం చేశారు,అయితే సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన ప్రియాంక గాంధీ ఈ ఏడాదే కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ పదవి చేపట్టారు. తూర్పు యూపీ ఇన్ చార్జిగా బాధ్యతలు చేపట్టే ఈ ఎన్నికల్లో అలుపెరగని ప్రచారం చేశారు. తాజాగా యూపీలో శోభనాద్ర సోనెభద్ర కాల్పుల ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలను పరామర్శించేందుకు ప్రియాంకా గాంధీ అక్కడకు వెళ్లేందుకు ప్రయత్నించారు కానీ ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం ప్రియాంకా గాంధీనే అడ్డుకొంది.

దీంతో ప్రియాంకా గాంధీ అక్కడే కూర్చొని పోలీసుల తీరును నిరసించారు, చివరకు బాధ్యతలను కలుసుకొని వారిని ఓదార్చారు. ఈ నేపథ్యం లో మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్ర్తి తనయుడు అనిల్ శాస్త్రి పార్టీ సీనియర్ నేత నట్వర్ సింగ్ మాజీ ఎంపీ శత్రుఘ్న సిన్హా తదితరులు ప్రియాంక కాంగ్రెస్ పగ్గాలు చేపట్టాలని అభిప్రాయపడ్డారు. ఈ క్రమంలో ఆమె ప్రెసిడెంట్ పదవి చేపట్టే విషయంలో క్లారిటీ ఇచ్చారు. ఇదిలా ఉండగా ప్రియాంకా గాంధీ సైతం రేసు నుంచి తప్పుకోవటంతో కాంగ్రెస్ సారథ్య బాధ్యతలు ఎవరికి అప్పగించనున్నారన్న ఆ అంశం ఆసక్తికరంగా మారింది.

కాంగ్రెస్ బాధ్యతలను వీరికే అప్పగించారు ఉన్నారంటూ పార్టీ సీనియర్ లలో కొందరి పేర్లను తెరపైకి వస్తున్నాయి. మల్లికార్జున ఖర్గే సుశీల్ కుమార్ షిండే దిగ్విజయ్ సింగ్ కుమారి సెల్జా ముకుల్ వాస్నిక్ సచిన్ పైలెట్ జ్యోతిరాదిత్య సింధియా తదితరులు ఒకరికి బాధ్యతలు అప్పగించనున్నట్లు తెలుస్తోంది. అయితే పార్టీ సీనియర్ల మధ్య విభేదాల వల్ల అధ్యక్షుడి ఎంపికలో జాప్యం జరుగుతున్నట్లు సమాచారం.

తుది నిర్ణయం రాహుల్ గాంధీ తిరిగి వచ్చిన తరువాత కాంగ్రెస్ అధ్యక్షుడు ఎంపికపై నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది, అయితే రాహుల్ గాంధీ విదేశీ పర్యటనపై అమెరికాలో ఉన్న సంగతి తెలిసిందే కొత్త సారథి ఎంపిక మరింత ఆలస్యమయ్యే పరిస్థితి తలెత్తితే తాత్కాలిక అధ్యక్షుడిగా ఒకరిని ఎన్ను కునే అంతర్గత ఎన్నిక ద్వారా ప్రెసిడెంట్ ను ఎంపిక చేయవచ్చన్న ప్రచారం జోరుగా సాగుతోంది. పార్లమెంటు సమావేశాలు ముగిసిన అనంతరం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశమై కొత్త ప్రెసిడెంట్ ఎన్నుకోనున్నట్టు సమాచారం. 


మరింత సమాచారం తెలుసుకోండి: