ఆంధ్రప్రదేశ్ లో జగన్ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. దేవాలయ ఉద్యోగాల్లోనూ రిజర్వేషన్లు పెంచుతోంది. ప్రతి దేవాలయంలో కూడా పాలక వర్గంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ బిల్లు రూపొందించింది.


జగన్ సర్కారు ఇప్పటికే.. బీసీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, మహిళలకు నామినేటెడ్‌ పదవుల్లో పెద్ద పీట వేశారు. ఇప్పుడు అదే ఒరవడి దేవాయాల్లోనూ కొనసాగించారు. ఆలయాల్లోనూ వారికి ప్రాధాన్యత కల్పిస్తూ ఈ బిల్లును రూపొందించారు.


అసెంబ్లీ సమావేశాల్లో దేవాదాయ చట్ట సవరణ బిల్లును దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ ప్రవేశపెట్టారు. చట్ట సవరణ బిల్లుపై సభలో చర్చ జరిగింది.దేవాలయాల్లో పవిత్రతను కాపాడటం, భక్తులకు మెరుగైన దర్శనం కల్పించే విధంగా బిల్లును రూపొందించామని మంత్రి చెప్పారు.


ఎవరైనా సభ్యులు అసభ్యంగా ప్రవర్తించినా, ఏదైనా దేవాలయాలకు ఆటంకం కల్పించినా ఆ సభ్యులను ట్రస్టు బోర్డు నుంచి తొలగించేలా బిల్లులో పేర్కొన్నారు. దేవాలయాల పవిత్రను కాపాడటం, భక్తులకు మెరుగైన దర్శనం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తెలిపారు. చర్చ అనంతరం అసెంబ్లీలో దేవాదాయ చట్ట సవరణ బిల్లుకు ఆమోదం తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: