కేంద్ర మాజీ మంత్రి ఎస్. జైపాల్ రెడ్డి అనూహ్యంగా కన్నుమూశారు. ఆయన వయసు డెబ్బై ఏడేళ్లు. కాంగ్రెస్ లో సీనియర్ నేతగా ఉన్న జైపాల్ రెడ్డికి చక్కటి మేధావిగా, రాజనీతిజ్ఞుడిగా పేరుంది. ఆయన తెలుగు,హిందీ,ఇంగ్లీష్ అనర్ఘళంగా మాట్లాడేవారు.


జైపాల్ రెడ్డి ఐదుసార్లు లోక్ సభకు, రెండుసార్లు రాజ్యసభకు ఎన్నికయ్యారు.జైపాల్ రెడ్డి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. న్యూమోనియాతో కొంతకాలంగా బాధపడుతున్న ఆయన గతగచ్చిబౌలిలోని ఎసియన్ గాస్ట్రో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.


జైపాల్ రెడ్డి హఠాన్మరణం నేపథ్యంలో ఆయన సేవలను అంతా స్మరించుకుంటున్నారు. ప్రత్యేకించి తెలంగాణ ఉద్యమ సమయంలో ఆయన చేసిన కృషిని గుర్తు చేసుకుంటున్నారు. తెలంగాణ బిల్లు అసెంబ్లీలో పాస్ అయ్యేందుకు జైపాల్ రెడ్డి చాలా కృష్టి చేశారు.


2014 ఫిబ్రవరి సమయంలో తెలంగాణ బిల్లుపై పార్లమెంటులో కొన్ని రోజుల పాటు ప్రతిష్టంభన కొనసాగింది. ఆంధ్రా సభ్యులు అడ్డుకోవడంతో అప్పటి స్పీకర్ మీరా కుమార్ ఏమీ చేయలేకపోయేవారు. సభను పదే పదే వాయిదా వేస్తూ వెళ్లేవారు. చివరకు పార్లమెంట్ సమావేశాలు ముగింపుదశకు వచ్చాయి.


అప్పుడు తెలంగాణ బిల్లు ఆమోదించకపోతే.. ఇక తెలంగాణ బిల్లు చెత్తబుట్టలోకి చేరిపోయేది.. ఆ సమయంలో మీరా కుమార్, మంత్రి సుష్మా స్వరాజ్ సమస్య పరిష్కారం కోసం జైపాల్ రెడ్డిని కలిశారట. సభ ఆర్డర్ లో లేకుండా నేను బిల్లుపై ఓటింగ్ ఎలా జరపను.. ఎలా లెక్కించను.. అని మీరాకుమార్ అడిగారట. అప్పుడు జైపాల్ రెడ్డి ఓ ఐడియా చెప్పారట.


మిమ్నల్ని సభ్యులందరినీ లెక్కించమని ఎవరు చెప్పారు.. లెక్కించినట్టు చెప్పి.. బిల్లు పాసయిందని ప్రకటించండి.. స్పీకర్ గా మీరు విశేషాధికారులు ఉన్నాయి అంటూ రూల్ బుక్కులోని పాయింట్ చూపించి చెప్పారట జైపాల్ రెడ్డి. దాంతో మీరా కుమార్ అలాగే చేశారు.. ఈ విషయాన్ని ఏపీ రాజకీయవేత్త ఉండవల్లి అరుణ్ కుమార్ తన పుస్తకంలో పేర్కొన్నారు. జైపాల్ రెడ్డి ఆమాట చెప్పి ఉండకపోతే.. తెలంగాణ వచ్చేదే కాదని ఆయన చెప్పారు.


మరింత సమాచారం తెలుసుకోండి: