రాష్ట్రంలో అధికారం చేప‌ట్టిన త‌ర్వాత వైఎస్ జ‌గ‌న్ పాల‌నలో తాన మార్క్ చూపుతున్నారు. ప్రజా సంక్షేమానికి పెద్ద పీట వేస్తూ, అవినీతి రహిత పాలనే ల‌క్ష్యంగా ముందుకుసాగుతున్నారు. ఎవరు తప్పు చేసినా ఉపేక్షించేది లేదంటూ సొంత పార్టీ ఎంపీ, ఎమ్మెల్యే, మంత్రుల‌కు కూడా హెచ్చ‌రిక‌లు జారీ చేశారు. ఇటీవ‌ల కేబినేట్‌లోని ఇద్ద‌రు మంత్రులు ఆమ్యామ్యాల‌కు తెర‌లేపార‌నే విష‌యం సీఎం జ‌గ‌న్ దాకా చేర‌డంతో ఆయ‌న సీరియ‌స్‌గా తీసుకున్న‌ట్లు సమాచారం. వెంట‌నే స‌ద‌రు మంత్రులను పిలిచి గట్టిగా వార్నింగ్ ఇచ్చార‌ని  ప్రచారం జ‌రుగుతోంది.
 
ఈ విష‌యం కాస్తా స‌ద్దుమ‌ణిగిందో లేదో... తాజాగా మ‌రో అవినీతి ఘ‌ట‌న వెలుగులోకి వచ్చింది. మేయర్ పోస్ట్ ఇప్పిస్తాన ని మంత్రి ఒక‌రు స‌ద‌రు నేత నుంచి కోట్ల రూపాయ‌ల‌కు బేరం కుదుర్చ‌కున్నాడ‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇప్పుడిదే వి షయంలో పార్టీలో ఆసక్తిదాయకమైన రాజకీయం నడుస్తోందని సమాచారం. మేయ‌ర్‌ పదవిని సొంతం చేసుకోవడానికి కొంతమంది తమ ఆర్థిక శక్తిని ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారట. 


జగన్ కేబినెట్ లో ఇప్పటికే చిన్నచిన్న అవినీతి కార్యకలాపాలకు తెర‌లేపిన మంత్రి ఒక‌రు ఈ మొత్తం వ్యవహారాన్ని చ‌క్క‌బెడుతున్నార‌నే వార్త పార్టీ వ‌ర్గాల్లో చ‌క్క‌ర్లు కొడుతోంది. ఎలాగైనా త‌న‌కు మేయ‌ర్ పీఠం ద‌క్కేలా చూడాల‌ని మంత్రి గారిని స‌ద‌రు నేత వేడుకున్నార‌ని తెలుస్తోంది. త‌న‌కు ప‌ద‌వి ఇప్పిస్తే ప్ర‌తిఫ‌లంగా ఐదు కోట్ల రూపాయల మేరకు ముట్ట‌జెప్ప‌డానికి రెడీ అని, ఎలాగైనా తన‌కు పదవి  దక్కేలా చేయమంటూ ఒక మహిళ ఆ మంత్రి గారి వద్ద బేరం పెట్టింద‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. 


వాస్తవానికి ఈ అంశం ఆ మంత్రి పరిధిలో లేక‌పోయిన‌ప్ప‌టికీ, ఐదు కోట్ల రూపాయలు అనగానే స‌ద‌రు మంత్రికి ఆశ పుట్టింద‌నే గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. తన చేతగాక పోయినా.. చూద్దాం..  అంటూ మంత్రి ఆ మహిళకు హామీ ఇచ్చాడని సమాచారం. ఆ ఐదు కోట్లు దండుకుని ఆమెను మేయర్ గా చేయాల‌ని స‌ద‌రు మంత్రివ‌ర్యులు భావిస్తున్నాడనే చ‌ర్చ జ‌రుగుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: