తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వ్యవహరించేందుకు కొన్ని పచ్చ పత్రికలు.. పచ్చ చానళ్లు ఉన్న సంగతి తెలిసిందే. ఆ పచ్చ మీడియాకు ఉదయం లేస్తే తమ నాయకులను పొగడటం.. ఎదుటి పార్టీని తిట్టడం.. ఇదే పని.. అయితే అందులో కొన్ని ఛానళ్ల అత్యుత్సాహం వాటి కొంప ముంచింది.


స్పీకర్ ఆగ్రహానికి ఆ మూడు ఛానళ్లు కారణమయ్యాయి. అసెంబ్లీ నియమావళికి విరుద్ధంగా ప్రసారాలు నిర్వహించినందుకే మూడు టివి చానల్స్‌కు నోటీసులు జారీ చేసినట్టు ఎపి శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారామ్ చెప్పారు. రూల్స్‌ తెలిసి కూడా తెలియనట్లు వ్యవహరిస్తే ఎలా అని ప్రశ్నించారు. నిద్రపోయేవారిని లేపవచ్చు కానీ.. నిద్రపోయినట్టు నటించే వాళ్లను ఏమి చేయలేమని వ్యాఖ్యానించారు.


అసలు ఇంతకీ.. ఏం జరిగిదంటారా.. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో మీడియా పాయింట్ దగ్గర ఎవరైనా మాట్లాడితే... వాటిని లైవ్ టెలికాస్ట్ చేయకూడదు. అసెంబ్లీ జరగని సమయంలోనే మీడియా పాయింట్ లైవ్ టెలికాస్ట్ చేయాలి.. అయితే ఈ నిబంధనను మూడు ప్రముఖ న్యూస్ ఛానల్లు ఉల్లంఘించాయి. అందుకు కారణం ఆరోజు టీడీపీ సభ నుంచి వాకౌట్ చేసి బయటకు రావడమే..


తమ అభిమాన పార్టీ నాయకుల కవరేజ్ ఇచ్చే అత్యుత్సాహంలో అసెంబ్లీ జరగుతుందన్న ఆలోచన మరిచారు. నిబంధన ఉల్లంఘించారు. దీంతో స్పీకర్ కు కోపం వచ్చేసింది. ఆ మూడు ఛానళ్లను అసెంబ్లీ ప్రాంగణంలోకి రాకూడదని ఆర్డర్ ఇచ్చారు. ఆ ఛానళ్లకు నోటీసులు ఇచ్చారు. మరి ఈ నిషేధం ఎంత కాలమో స్పీకర్ కే తెలియాలి.


అసెంబ్లీ ప్రాంగణం వరకూ స్పీకర్ కే సర్వాధికారాలు ఉంటాయి.. అక్కడ ఆయన చెప్పిందే వేదం.. ఆయన చేసిందే శాసనం.. అందులోనూ ఈ మూడు ఛానళ్లు నిబంధనలను ఉల్లంఘించాయి. తెలిసి చేసినా.. తెలియక చేసినా.. తప్పు తప్పే.. మరి స్పీకర్ కు ఎన్నాళ్లకు కరుణ కలుగుతుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: