ఏపీలో టాక్సుల పర్వం మొదలైందా. ఇప్పటికీ అధిక భారాలను మోస్తున్న వారి మీద కొత్త టాక్సులా. జీఎస్టీ చూశారు, ఇంకో టాక్స్ చూశారు, ఇపుడీ కొత్త టాక్స్ ఏంటి. దాని కధా కమామీషూ  ఏంటి.. అంటే చెప్పేందుకు చాలా ఉందిట. ఇది పడితే  ఆటం బాంబేనట. నెత్తి మీద బండ పెట్టి మోదినట్లేనట. మరి ఈ టాక్స్ ని ఎవరికి వర్తింపచేస్తారు. అన్ని వర్గాల వారూ ఉంటారా కొందరికే పరిమితం చేస్తారా...


అంటే  కొందరికే ఈ టాక్స్ అంటున్నారు ట్విట్టర్ పిట్ట, టీడీపీ భావి భారత నాయక లోకేష్ బాబు. జే అంటే జగన్ ట. జగన్ పేరు మీద వేసే ఈ టాక్స్ తో బిల్డర్లను హడలుకొడుతున్నారుట. గ్రామాలల్లో పట్టణాలలో భవనాలు నిర్మించే వారి మీద ఈ టాక్స్ వైసీపీ నేతలు వేస్తూ లక్షల్లో జే టాక్స్ వసూల్ చేస్తున్నారంటూ ట్విట్టర్ వేదికగా లోకేష్ హాట్ కామెట్స్ చేశారు. 


ఈ టాక్స్ వల్ల అసలే ఇసుక దొరకక అంతంతమాత్రంగా ఉన్న నిర్మాణ రంగం కుదేలవుతోందని కూడా లోకేష్ అంటున్నారు. వైసీపీ అధికారంలోకి రావడంతోనే ఇసుక లేకుండా చేశారు. కూలీలకు పని లేకుండా చేశారు. ఇపుడు అక్రమంగా ఇసుక సప్లై చేస్తామంటూ బిల్డర్ల మీద పడ్డారు. వారికి జే టాక్స్ విధించి లక్షల్లో దోచుకుంటున్నారు అంటూ లోకేష్ పవర్  ఫుల్ ఆరోపణలే చేస్తున్నారు.


అపుడెపుడే జగన్ గుంటూర్ టూర్లో పాదయాత్ర చేస్తూ  కే టాక్స్ అంటూ కోడెల ఫ్యామిలీ మీద వేసిన సెటైర్లు బాగా పేలాయి. దాంతో ఇపుడు మక్కీకి మక్కీ కాపీ కొట్టేసి మరీ లేకెష్ జగన్ టాక్స్ అంటున్నారు. ఆ విధంగా కౌంటర్ అటాక్ చేస్తున్నారు. ఇంతకీ జే టాక్స్ లో మీ వాటా ఎంత సీఎం గారు అంటూ జగన్ని ప్రశ్నిస్తున్నాడు లోకేష్. మీ వాళ్ళు దోచుకుంటున్నారు అంటూ లొకేష్ ట్విట్టర్లో ఓ రేంజిలో రెచ్చిపోతున్నారు. మరి జగన్ సర్కార్ దీని మీద ఏమంటుందో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: