హన్మకొండలో 9 నెలల చిన్నారిపై హత్యాచారానికి పాల్పడిన నిందితుడికి వరంగల్ జిల్లా పాస్ట్  ట్రాక్  కోర్టు ఉరి శిక్ష విధించింది. ఈ తీర్పును తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు  కేటీఆర్ స్వాగతించారు.మానవ మృగానికి కోర్టు సరైన శిక్ష వేసిందని అన్నారు . నిందితుడికి శిక్ష పడటానికి పోరాడిన వరంగల్ న్యాయవాదులను, పోలీసులను ఆయన  అభినందించారు.‘ఇలాంటి మానవ మృగాలకు , భయంకరమైన నేరస్థులను కఠినంగా శిక్షించడానికి భవిష్యత్‌లో మరిన్ని కఠిన చట్టాలు రూపొందించాలని , ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలని  కేటీఆర్ ట్వీట్ చేశారు.


 వరంగల్‌లో తొమ్మిది నెలల చిన్నారిపై అత్యంత పాశవికంగా లైంగిక దాడికి పాల్పడి, హత్య చేసిన విషయం తెల్సిందే . వరంగల్ పాస్ట్ ట్రాక్ కోర్టు న్యాయమూర్తి జయకుమార్ నిందితుడు ప్రవీణ్ కుమార్ కు మరణశిక్ష ఖరారు చేస్తూ తీర్పు వెలువరించారు .  కామాంధుడికి ఉరి శిక్ష విధించాలని ప్రజాసంఘాలు , మహిళా సంఘాలు ఆందోళనలు నిర్వహించాయి .


 ప్రజాసంఘాలు , మహిళా సంఘాలను ఫలితంగా పోలీసులు ఈ కేసును సీరియస్ గా తీసుకుని ,  కేవలం 48 రోజుల్లోనే శిక్ష పడేలా చర్యలు తీసుకున్నారు . తమ తొమ్మిది నెలల చిన్నారిపై అత్యాచారం చేసి , హత్య చేసిన మానవ మృగాన్ని  కఠినంగా శిక్షించాలని తల్లితండ్రులు సైతం ఆందోళనకు దిగిన విషయం తెల్సిందే . పాస్ట్ ట్రాక్ కోర్టు నిందితునికి ఉరి శిక్ష విధించడం పట్ల చిన్నారి తల్లితండ్రులు హర్షం వ్యక్తం చేసినప్పటికీ , నిందితున్ని ఉరి తీసినప్పుడే తమకు మనశ్శాంతి లభిస్తుందని వ్యాఖ్యానించారు . దేశ వ్యాప్తంగా అత్యాచార కేసులన్నీ పెండింగ్ లో ఉన్నాయని , వాటిని సత్వరమే పరిష్కరించి నిందితులని కఠినంగా శిక్షించేందుకు పాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలని ప్రజా , మహిళా సంఘాలు కోరుతున్నాయి . 


మరింత సమాచారం తెలుసుకోండి: