డైనోసార్స్ యుగంలో మనుగడ సాగించిన రాక్షస బల్లులు పెద్ద పెద్ద జంతువులను సైతం అమాంతంగా తినేసేవి.  ఈ డైనోసార్స్ లో కూడా అనేక రకాలు ఉన్న సంగతి తెలిసిందే.  కొన్ని చెట్లకు ఉండే ఆకులను తింటూ శాఖాహారులుగా జీవనం సాగిస్తే.. మరికొన్ని మాత్రం జంతువులను వేటాడి తినేవి.  ఆ తరువాత వాతావరణంలో మార్పులు సంభవించడంతో.. డైనోసారులు అంతరించిపోయాయి.  అప్పుడప్పుడు వాటి ఎముకులు వంటివి శిలాజాల రూపంలో ఆంత్రోపాలజిస్టులకు దొరుకుతుంటాయి.  



వీటి నుంచి రూపాంతరం చెంది కొన్ని పక్షులుగాను కొన్ని సర్వీసురూపాలుగాను అవతరించాయి.  ఇలా అవతరించిన వాటిల్లో కొమాడో డ్రాగన్ ఒకటి.  వీటిని మోనిటర్ లిజార్డ్స్ అని పిలుస్తారు.  మాములుగా మోనిటర్ లిజార్డ్స్ కంటే ఆకారంలో పెద్దగా ఉండే వాటిని కొమాడో లిజార్డ్స్ అంటారు.  ఇవి చాలా బలంగా ఉంటాయి.  ఇవి సాధారణంగా ఇండోనేషియాలో ఎక్కువగా కనిపిస్తుంటాయి.  



వీటి నాలుక చాలా పొడవుగా బలంగా ఉంటుంది.  దీని లాలాజలంతో 20 రకాల బ్యాక్టీరియాలు ఉంటాయి.  ఈ బ్యాక్టీరియా వలన దీని లాలాజలం విషంగా మారుతుంది.  బలంగా ఉండే జంతువులను కూడా ఇవి వేటాడి తినేస్తుంటాయి.  రీసెంట్ గా ఇండోనేషియాలోని ఓ దీవిలో కొమాడో డ్రాగన్ ఓ కోతిని అమాంతంగా మింగేసింది.  


ఈ డ్రాగన్ దగ్గరకు వచ్చి ఆటలాడుతున్న కోతిని ఆ డ్రాగన్ అమాంతంగా నోటితో పట్టేసింది. రెండు నిముషాలు ఆరు గుటకల్లో ఆ కోతిని స్వాహా చేసింది.  దీనిని ఓ వ్యక్తి వీడియోగా తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.  ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నది.  అయితే, ఇప్పటివరకు ఈ కొమాడో డ్రాగన్ లు మనుషులకు ఎలాంటి హాని కలిగించలేదని, తెలుస్తోంది.  కొమాడో డ్రాగన్ లు తిరిగే ప్రదేశంలో జాగ్రత్తగా ఉండాలని అక్కడి ప్రభుత్వం ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తుంటుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: