యాక్టర్ అలీ.. చిన్నాపెద్దా అందరికీ పరిచయం ఉన్న నటుడు.. దాదాపు 40 ఏళ్లకుపైగా సినీ అనుభవంతో అందరి హృదయాల్లోనూ చోటు సంపాదించాడు. బాలనటుడిగా క్యారెక్టర్ ప్రారంభించి.. హీరోల స్నేహితుడి వేషాల వరకూ ఎన్నో వేశాడు. ఆ తర్వాత ఎస్వీ కృష్ణారెడ్డి చలవతో యమలీల సినిమాతో ఏకంగా హీరో అయ్యాడు. హీరో అయినా కమెడియన్ గానూ కొనసాగుతూ ఆల్ ఇన్ వన్ అనిపించుకున్నాడు.


అలాంటి అలీకి ఇటీవల ఇన్ టాక్స్ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చిందట. ఏదో ఆదాయపు పన్ను వ్యవహారం కదా అని అలీ వెళ్లాడట. కానీ అక్కడ సీన్ చూసి అలీ షాకయ్యాడట. ఇంతకీ ఆ ఇన్ కంటాక్స్ ఆఫీసర్ పిలించిది ఆదాయం పన్ను వ్యవహారాలు మాట్లాడటం కోసం కాదట. ఆయన స్నేహితుడు సినిమా చేయాలనుకుంటున్నాడట. అందులో హీరోగా అలీ నటించాలని అడిగేందుకు పిలిచారట. ఆ ఆఫీసరు ఫ్రెండే ఈ దిలీప్ రాజా.. ఆ తర్వాత అలీకి మొదట కొన్ని పాటలు పంపి వినమన్నారట. ఆ పాటలు నచ్చడంతో అలీ సినిమా చేస్తానని చెప్పారట. కథ కూడా చాలా బాగుందట.


ఈ విషయాన్ని అలీ ఈ సినిమా ఆడియో రిలీజ్ వేళ చెప్పారు. ఇంతకీ ఆ సినిమా ఏంటో చెప్పలేదు కదూ.. అదే.. పండుగాడి ఫోటో స్టూడియో’. ‘వీడు ఫోటో తీస్తే పెళ్ళి అయిపోద్ది’ అనేది ట్యాగ్‌లైన్. నిర్మాత వెంకటేశ్వర విద్యాలయ సంస్థ అధినేత‌గా ఉన్న సాంబిరెడ్డి.


ఈ కథ కోసం చిత్ర దర్శకుడు దిలీప్ రాజా రెండు సంవత్సరాలు కష్టపడ్డాడట. ఈ కథను దర్శకుడు సుకుమార్ ఓకే అన్న తర్వాతే తెరకెక్కించారట. జంధ్యాలగారి మార్క్ కామెడీతో ఈ చిత్రం ఉంటుందని డైరెక్టర్ అంటున్నారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.. ఆలీగారు హీరోగా రీ ఎంట్రీ ఇస్తున్నారు. ఆయన ఈ సినిమాకు పూర్తి న్యాయం చేశారు. ఇక సినిమా విషయానికి వస్తే... పండుగాడు ఫోటో తీస్తే ఎవరికైనా పెళ్లై పోతుంది అనేది కాన్సెప్ట్. సీన్ టు సీన్ కామెడీ ఉండేలా రాసుకున్నాను...అంటున్నాడీ డైరెక్టర్.


మరింత సమాచారం తెలుసుకోండి: